Share News

లాభాల్లో మారుతి సుజుకీ రికార్డు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:30 AM

మారుతి సుజుకీ 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,877.8 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఆర్జించిన లాభంలో కొత్త రికార్డు ఇది. 2022-23

లాభాల్లో మారుతి సుజుకీ రికార్డు

క్యూ4 లాభం రూ.3,879 కోట్లు

రూ.5 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.125 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,877.8 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఆర్జించిన లాభంలో కొత్త రికార్డు ఇది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం లాభం రూ2,623.6 కోట్లతో పోల్చితే ఇది 47.8 శాతం అధికం. ఎస్‌యూవీలు భారీగా అమ్ముడుపోవడంతో పాటు కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా పెరిగిన మార్జిన్లు, వ్యయ నియంత్రణ చర్యలు, సామర్థ్యాల వినియోగం పెంపు లాభంలో వృద్ధికి కారణాలుగా ఉన్నాయని మారుతి సుజుకీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ 5.84 లక్షల కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే కార్ల విక్రయాలు 13.4 శాతం పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో యుటిలిటీ వాహనాల వాటా 24 శాతం నుంచి 36 శాతానికి పెరిగింది. వరుసగా మూడో ఏడాది కూడా కంపెనీ అత్యధిక కార్ల ఎగుమతిదారుగా నిలిచింది. దేశం నుంచి ఎగుమతి అయిన కార్లలో మారుతి వాటా 41.8 శాతం ఉంది. కాగా ఏడాది మొత్తానికి కంపెనీ 21,35,323 కార్లు విక్రయించింది. త ఏడాదితో పోల్చితే ఇది 8.6 శాతం అధికం. వీటిలో దేశీయ అమ్మకాలు 18,52,256 యూనిట్లు కాగా 2,83,067 కార్లు ఎగుమతి చేసింది. ఇదిలా ఉండగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. కంపెనీ చరిత్రలో చెల్లిస్తున్న అత్యధిక డివిడెండ్‌ ఇదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.90 డివిడెండ్‌ చెల్లించింది.

Updated Date - Apr 27 , 2024 | 05:35 AM