Share News

తగ్గిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లాభం

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:19 AM

ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.282.74 కోట్ల ఆదాయంపై రూ.11.67 కోట్ల నికర లాభాన్ని...

తగ్గిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లాభం

ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.282.74 కోట్ల ఆదాయంపై రూ.11.67 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.369.23 కోట్లుగా ఉండగా లాభం రూ.27.80 కోట్లుగా ఉంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.1,126.19 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.73.64 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - Apr 26 , 2024 | 04:19 AM