Share News

యస్‌ బ్యాంక్‌ లాభంలో రెండింతల వృద్ధి

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:55 AM

గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రెండింతల వృద్ధితో రూ.452 కోట్లుగా నమోదైంది...

యస్‌ బ్యాంక్‌ లాభంలో రెండింతల వృద్ధి

ముంబై: గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రెండింతల వృద్ధితో రూ.452 కోట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.202.43 కోట్లుగా ఉంది. ఆదాయ పన్ను రిటర్నులపై వడ్డీ సహా ఆదాయ పన్ను రైట్‌బ్యాక్‌తో లబ్ది పొందటం ఈ త్రైమాసికంలో ఎంతగానో కలిసివచ్చిందని పేర్కొంది. అయితే ప్రయారిటీ సెక్టార్‌ లెండింగ్‌ (పీఎ్‌సఎల్‌) నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి రావటంతో లాభం పరిమిత స్థాయిలో ఉందని తెలిపింది. త్రైమాసిక సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయ 2.3 శాతం వృద్ధితో రూ.2,153 కోట్లకు చేరుకుందని బ్యాంక్‌ వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం ఏకంగా 74 శాతం వృద్ధితో రూ.1,251 కోట్లకు చేరుకుందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.

Updated Date - Apr 28 , 2024 | 01:55 AM