Share News

Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:51 PM

పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు పెద్దలకు తర్పణం వదలాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అలా కానీ పక్షంలో కనీసం మహాలయ పక్ష అమావాస్య రోజు అయినా.. తర్పణం వదలాలని వారు సూచిస్తున్నారు. ఈ ఏడాది భద్రపద మాసం చివరి రోజు అంటే.. అక్టోబర్ 2వ తేదీ మహాలయ పక్ష అమావాస్య వచ్చింది. ఈ రోజు.. పితృ దేవతలను తలుచుకుని వారికి తర్పణం వదలాలంటున్నారు.

Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..

ఏ పని చేస్తున్నా.. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా కష్టించి పని చేసినా ఫలితం మాత్రం దక్కకుండా పోతుంది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. అవకాశం ఇలా వచ్చి.. అలా కళ్ల ముందే మాయమైపోతుంది. దీంతో ఎందుకు మనకీ పరిస్థితి ఏర్పడిందంటూ పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు. అటువంటి వారిని పితృదోషం వెంటాడుతుందని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ దోషం కారణంగానే వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని వారు పేర్కొంటున్నారు. ఈ తరహా దోషాలను తొలగించుకునేందుకు ఈ మహాలయ పక్షాలు చక్కగా ఉపయోగపడతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


పక్షం రోజుల్లో కాకుంటే.. చివరి రోజు..

పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు పెద్దలకు తర్పణం వదలాలని వారు స్పష్టం చేస్తున్నారు. అలా కానీ పక్షంలో కనీసం మహాలయ పక్ష అమావాస్య రోజు అయినా.. తర్పణం వదలాలని వారు సూచిస్తున్నారు. ఈ ఏడాది భద్రపద మాసం చివరి రోజు అంటే.. అక్టోబర్ 2వ తేదీ మహాలయ పక్ష అమావాస్య వచ్చింది. ఈ రోజు.. పితృ దేవతలను తలుచుకుని వారికి తర్పణం వదలాలి. తద్వారా వంశంలోని పెద్దల దీవెనలు మనపై తప్పకుండా ఉంటాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


పంచమవేదంలో సైతం ప్రస్తావన..

పంచమవేదం మహాభారతంలో సైతం ఈ మహాలయ అమావాస్యను ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేస్తున్నారు. ఈ అమావాస్య రోజు.. పితృ శ్రాద్ధాలు, అన్న సంతర్పణ చేయడం వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయని వారు పేర్కొంటున్నారు. ఇవి చేయడానికి సమయం చిక్కని వారు.. కనీసం బియ్యం, పప్పు, ఉప్పులను ఏ గూడికో వెళ్లి బ్రాహ్మణులకు స్వయంపాకంగా అందజేసిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని విశదీకరిస్తున్నారు.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


కనీసం ఇలా అయినా చేయండి.. చాలు..

అలాగే వృద్దులు, పేదలు, ఆపదల్లో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల సైతం శుభం జరిగే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయని వారు విపులీకరిస్తున్నారు. మహాలయ పక్ష అమావాస్య రోజు.. పితృ దేవతల ఆరాధన వల్ల దేవతలను పూజించడం కంటే ఎన్నో రెట్లు అధిక పుణ్య ఫలం దక్కే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు పితృ తర్పణ వల్ల గతించిన ఏడు తరాలు సంతసిస్తాయని వారు చెబుతున్నారు.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Sep 30 , 2024 | 03:52 PM