Share News

Horoscope Today: ఈ రాశివారి జీవితంలో నేడు కీలక పరిణామం..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:37 AM

నేడు (15-4-2024 - సోమవారం) సంకల్పం నెరవేరుతుంది. మీ మనసు మార్పు కోరుకుంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం...

Horoscope Today: ఈ రాశివారి జీవితంలో నేడు కీలక పరిణామం..!

నేడు (15-4-2024 - సోమవారం) సంకల్పం నెరవేరుతుంది. మీ మనసు మార్పు కోరుకుంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సంకల్పం నెరవేరుతుంది. మీ మనసు మార్పు కోరుకుంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. కుటుంబం విస్తరిస్తుంది. ఇంటి అవసరాలపై దృష్టి సారిస్తారు. హోమ్‌డెకార్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. తోబుట్టువుల సమస్యలను పరిష్కారిస్తారు. లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, డిపాజిట్లకు అనుకూలం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పైఅధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాలకు అనుకూలం. సినమాలు, రాజకీ యాలు, టెలివిజన్‌, పత్రికల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. సేవా కార్యక్రమాలు మనుసుకు ఊరటనిస్తాయి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గత అనుభవంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వరంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయవిషయాల్లో పెద్దలు సహకరిస్తారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, కళా రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. కీలక సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్నులు, బీమా వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయ వివాదాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్లూలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఒక వార్త ఆనందం కలగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు ల భిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మూచ్యువల్‌ ఫండ్స్‌, చిట్‌ఫండ్‌ తదితర పెట్టుబడులు లాభిస్తాయి. క్రీడలు, బోధన, బ్యాంకింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Apr 15 , 2024 | 07:37 AM