Share News

ఎర్ర అరటిలో...

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:23 PM

ఎరుపు రంగు అరటిపండులో పోషకాలు ఎక్కువ. శరీర జీవక్రియలకు తోడ్పడే కీలకమైన సూక్ష్మ పోషకాలు, విటమిన్ల కోసం పసుపు అరటి బదులుగా ఎరుపు అరటి ఎంచుకోవాలి.

ఎర్ర అరటిలో...

ఎరుపు రంగు అరటిపండులో పోషకాలు ఎక్కువ. శరీర జీవక్రియలకు తోడ్పడే కీలకమైన సూక్ష్మ పోషకాలు, విటమిన్ల కోసం పసుపు అరటి బదులుగా ఎరుపు అరటి ఎంచుకోవాలి.

ఇమ్యూనిటీ బూస్టర్‌: దీన్లోని మెగ్నీషియం, పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించి, రక్తనాళాలకు స్వాంతననిస్తాయి. వీటిలోని విటమిన్‌ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ విటమిన్‌తో చర్మపు ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజన్‌ కూడా పెరుగుతుంది.

కళ్లకు మేలు: వీటిలోని కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. ల్యూటీన్‌, బీటా కెరోటీన్‌ అనే ఈ కెరోటినాయిడ్లు మాక్యులర్‌ డీజనరేషన్‌ అనే ఛత్వారాన్ని వాయిదా వేస్తాయి.

అధిక బరువు: ఈ పండ్లలోని అత్యధిక పీచు, కీలకమైన పోషకాలు ఆకలిని నియంత్రించి, అదనపు చిరుతిళ్ల వైపు మనసు మళ్లకుండా చేస్తాయి. ఫలితంగా అధిక బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

మానసికోల్లాసం: ఎర్ర అరటిపండ్లలోని విటమిన్‌ బి6 ట్రిప్టోఫాన్‌ను సెరటోనిన్‌గా మారుస్తుంది. ఈ ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌ పెరగడం వల్ల డిప్రెషన్‌ దూరమై మనసు హుషారుగా మారుతుంది.

యాంటీఆక్సిడెంట్లు: అన్ని పండ్లలాగే ఎరుపు అరటిలో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 11 రకాల ఖనిజ లవణాలు, 6 రకాల విటమిన్లతో పాటు, లెక్కలేనన్ని ప్రయోజనకరమైన పిండిపదార్థాలను కలిగి ఉండే ఎరుపు అరటి పండును తరచూ తింటూ ఉండడం

ఆరోగ్యకరం.

Updated Date - Mar 25 , 2024 | 11:23 PM