Share News

Story : బుద్ధి హీనులు

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:54 PM

అనగనగా ఓ పిసినారి ఉండేవాడు. బాగా ధనికుడు. చిన్న విషయం కూడా పదులసార్లు ఆలోచించేవాడు. ఒక రోజు తన కొడుకును తీసుకుని ఓ సంతకు వెళ్లాడు. అక్కడ ఇద్దరికీ ఏమీ నచ్చలేదు. కొడుక్కు ఏదైనా వస్తువు నచ్చితే అది బాగలేదనేవాడు తండ్రి. ఏదైనా తండ్రికి

Story : బుద్ధి హీనులు

అనగనగా ఓ పిసినారి ఉండేవాడు. బాగా ధనికుడు. చిన్న విషయం కూడా పదులసార్లు ఆలోచించేవాడు. ఒక రోజు తన కొడుకును తీసుకుని ఓ సంతకు వెళ్లాడు. అక్కడ ఇద్దరికీ ఏమీ నచ్చలేదు. కొడుక్కు ఏదైనా వస్తువు నచ్చితే అది బాగలేదనేవాడు తండ్రి. ఏదైనా తండ్రికి నచ్చిన వస్తువు కనపడితే ‘మనకు పనికి రాదు’ అన్నాడు కొడుకు. అలా ఇద్దరూ ఏ వస్తువు కొనకుండా వెళ్తుంటే వారికి ఓ గుర్రాల సంత కనపడింది. ఆ సంతలోకి వెళ్లారు. ఆ రోజు ఎందుకో బలిష్టంగా ఉండే నల్లని గుర్రం వారికి నచ్చింది. సొమ్ము ఇచ్చి కొన్నారు. తాడును కూడా అమ్మిన వారితో ఇప్పించుకుని ఇంటికి బయలుదేరారు తండ్రీకొడుకులు.

ఇద్దరూ నడుస్తున్నారు. మాట్లాడుకుంటూ నడుస్తుంటే గుర్రం ఇకిలిస్తోంది. ఓ గుట్ట కనపడింది. ఇక లాభం లేదనుకుని.. ఇద్దరూ గుర్రం ఎక్కారు. ఆ గుర్రం కొంచెం వేగంగా పరిగెత్తి.. గుట్ట దగ్గర మెల్లగా నడిచింది. నీళ్లు, ఆహారం తిన్నదో లేదో అని తెలుసుకోకుండా అలానే గుర్రాన్ని ఉరికెత్తించారు. నోటిలో లాలాజలం కక్కుతూ గుర్రం కష్టంగా నడుస్తోంది. దారిలో ఉండేవాళ్లు కొంతమంది ఇలా అన్నారు.. ‘చూడటానికి దున్నల్లా ఉన్నారు. నడవలేరా? పాపం గుర్రం బరువుగా నడుస్తోంది’ అన్నారు. వెంటనే ఇద్దరూ కిందకు దిగారు.

అలానే ఇద్దరూ గుర్రం తీసుకుని నడుస్తూ వెళ్తున్నారు. కొద్దిసేపయ్యాక పెద్దాయన గుర్రమెక్కాడు. తన కుమారుడు నడుస్తూ వస్తున్నాడు. కొందరు ఆడవాళ్లు నీళ్లకు పోతున్నారు. పాపం.. పసివాడు నడుస్తుంటే.. ఆయన గుర్రం మీద ఊరేగుతున్నాడు అన్నారు. అది విన్న తండ్రి బాధపడ్డాడు. నేను వద్దు.. నువ్వు గుర్రం ఎక్కు అని కొడుకును ఎక్కించాడు. మరో ఊరిలోకి వెళ్తూనే.. ‘చూడటానికి గున్నలా ఉన్నాడు కొడుకు. పాపం ముసలాయన్ని నడిపిస్తున్నాడు. ఈ కాలం పిల్లలంతే. తండ్రి చచ్చినా పర్వాలేదు’ అన్నాడు ఓ తెలిసిన చుట్టం. దీంతో వెంటనే కొడుకు కిందకు దిగాడు.

చివరగా ఇద్దరూ నడుస్తూ ఉన్నారు. ఎవరూ గుర్రం ఎక్కలేదు. ఆ ఊరి చివరకు వస్తూనే ఓ వాగు వంతెన దాటుతుండగా బలంగా గుర్రాన్ని నీళ్లలోకి తోశారు. పాపం ఆ గుర్రం నీళ్లలోంచి ఈది వెళ్లిపోయింది. ఈ బుద్ధిహీనులు ఇంటికి వచ్చి గర్వంగా కనిపించారు. అయితే తాము కొన్న గుర్రం ధరను మరిచిపోయి సంతోషించారు.

Updated Date - Jan 26 , 2024 | 10:54 PM