Share News

Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం..

ABN , Publish Date - Feb 21 , 2024 | 06:55 AM

నేడు (21-2-2024 - బుధవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం..

నేడు (21-2-2024 - బుధవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఫర్నీచర్‌, హార్డ్‌వేర్‌, నిత్యావసరాల రంగాల వారికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు అందుకునేందుకు ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కళలు, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యూహాలను విజయవంతంగా అెులు చేస్తారు. వీ సా, పాస్‌పోర్ట్‌ కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గణేశ పంచరత్నమాల వినడం శుభప్రదం.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, పెన్షన్‌, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ఊటనిస్తాయి. పెద్దల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. శుభకార్యాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వైద్య, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కన్సల్టెన్సీలు, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

గృహరుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు ఉ ల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీరామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ఆర్థింకంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వినూత్నంగా ఆలోచించి సత్ఫలితాలు సాధిస్తారు. ప్రియతమలు వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Mar 06 , 2024 | 07:50 AM