పారిస్‌కు షూటర్ల బృందం
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:54 AM
పది మంది సభ్యులతో కూడిన భారత పారా షూటర్ల బృందం ప్రతిష్టాత్మక పారాలింపిక్స్‌లో పోటీపడేందుకు శనివారం పారి్‌స బయల్దేరింది. టోక్యో క్రీడల్లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ అవనీ లేఖరా మరోసారి...
న్యూఢిల్లీ: పది మంది సభ్యులతో కూడిన భారత పారా షూటర్ల బృందం ప్రతిష్టాత్మక పారాలింపిక్స్‌లో పోటీపడేందుకు శనివారం పారి్‌స బయల్దేరింది. టోక్యో క్రీడల్లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ అవనీ లేఖరా మరోసారి అదే తరహా ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది. పిస్టల్ షూటర్ మనీష్ నర్వాల్‌పై కూడా స్వర్ణ ఆశలు ఉన్నాయి. గత క్రీడల్లో షూటింగ్‌లో భారత్ రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు సాధించింది. ఈసారి అంతకంటే ఎక్కువ మెడల్స్ సాధిస్తారన్నది అంచనా.