Share News

ఫ్రేజర్‌ ధనాధన్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:44 AM

ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన మరో హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో గట్టెక్కిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఐపీఎల్‌లో నాకౌట్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జేక్‌ ఫ్రేజర్‌ (27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) సుడిగాలి అర్ధ శతకంతో...

ఫ్రేజర్‌ ధనాధన్‌

నేటి మ్యాచ్‌లు

గుజరాత్‌ X బెంగళూరు, మ.3.30 గం. నుంచి

చెన్నై X హైదరాబాద్‌, రాత్రి 7.30 గం. నుంచి

  • ఫ్లేఆఫ్స్‌ రేసులో ఢిల్లీ

  • పోరాడి ఓడిన ముంబై

  • తిలక్‌, డేవిడ్‌ పోరాటం వృథా

న్యూఢిలీ: ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన మరో హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో గట్టెక్కిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఐపీఎల్‌లో నాకౌట్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జేక్‌ ఫ్రేజర్‌ (27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) సుడిగాలి అర్ధ శతకంతో శనివారం జరిగిన పోరులో ఢిల్లీ 10 పరుగులతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 257/4 స్కోరు చేసింది. స్టబ్స్‌ (25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్‌), హోప్‌ (17 బంతు ల్లో 5 సిక్సర్లతో 41), అభిషేక్‌ పోరెల్‌ (36) అదరగొట్టారు. ఛేదనలో ముంబై 247/9తో లీగ్‌లో తమ అత్యధిక స్కోరు చేసినా ఓటమి తప్పలేదు. తిలక్‌ వర్మ (32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63), హార్దిక్‌ పాండ్యా (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) పోరాడారు. రసిక్‌, ముకేశ్‌ చెరో 3 వికెట్లు తీశారు.

టాపార్డర్‌ విఫలం: భారీ ఛేదనలో రోహిత్‌ (8), ఇషాన్‌ (20), సూర్యకుమార్‌ (26) వికెట్లు చేజార్చుకొన్న ముంబై పవర్‌ప్లేలో 65/3తో నిలిచింది. ఈ దశలో తిలక్‌, కెప్టెన్‌ హార్దిక్‌ నాలుగో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మ్యాచ్‌లో నిలిపారు. అయితే, 13వ ఓవర్‌లో పాండ్యా, నేహల్‌ (4)ను రసిక్‌ అవుట్‌ చేయడంతో.. ముంబై 140/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, తిలక్‌, డేవిడ్‌ ఆరో వికెట్‌కు 29 బంతుల్లో 70 రన్స్‌ జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపారు. చివరి 3 ఓవర్లలో విజయానికి 64 రన్స్‌ కావాలి. ఈ దశలో 18వ ఓవర్‌లో ముకేష్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ 6,4,6తో చెలరేగినా.. వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత నబి (7) వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో గెలుపునకు 25 పరుగులు అవసరమవగా.. తొలి బంతికి తిలక్‌ రనౌటవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

బాదుడే బాదుడు: ఓపెనర్‌ ఫ్రేజర్‌ విధ్వంసానికి తోడు డెత్‌ ఓవర్లలో స్టబ్స్‌ మెరుపులు మెరిపించడంతో.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఢిల్లీ తమ భారీస్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే విరుచుకుపడింది. ఉడ్‌ వేసిన మొదటి ఓవర్‌లో ఫ్రేజర్‌ 4,4,6,4తో 19 రన్స్‌ పిండుకొన్నాడు. తర్వాత బుమ్రా బౌలింగ్‌లో 4,6 బాదాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్న ఫ్రేజర్‌.. ఈ సీజన్‌లో తన ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును తానే అధిగమించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ రాణించడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 92/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, 8వ ఓవర్‌లో ఫ్రేజర్‌ను చావ్లా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అభిషేక్‌ వెనుదిరిగినా.. హోప్‌, పంత్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29) రెండో వికెట్‌కు 53 రన్స్‌ జోడించారు. హోప్‌ స్థానంలో వచ్చిన స్టబ్స్‌ 18వ ఓవర్‌లో ఉడ్‌ బౌలింగ్‌లో 5 ఫోర్లు, సిక్స్‌తో 26 రన్స్‌ రాబట్టాడు. పంత్‌ను బుమ్రా అవుట్‌ చేసినా.. అక్షర్‌(11 నాటౌట్‌), స్టబ్స్‌ కలిసి స్కోరును 250 దాటించారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ: జేక్‌ ఫ్రేజర్‌ (సి) నబి (బి) చావ్లా 84, అభిషేక్‌ పోరెల్‌ (సి) ఇషాన్‌ (బి) నబి 36, హోప్‌ (సి) తిలక్‌ (బి) ఉడ్‌ 41, పంత్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 29, స్టబ్స్‌ (నాటౌట్‌) 48, అక్షర్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 257/4; వికెట్ల పతనం: 1-114, 2-127, 3-180, 4-235; బౌలింగ్‌: ల్యూక్‌ ఉడ్‌ 4-0-68-1, బుమ్రా 4-0-35-1, తుషార 4-0-56-0, చావ్లా 4-0-36-1, హార్దిక్‌ 2-0-41-0, నబి 2-0-20-1.

ముంబై: ఇషాన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 20, రోహిత్‌ (సి) హోప్‌ (బి) ఖలీల్‌ 8, సూర్య (సి) విలియమ్స్‌ (బి) ఖలీల్‌ 26, తిలక్‌ (రనౌట్‌) 63, హార్దిక్‌ (సి) ముకేశ్‌ (బి) రసిక్‌ 46, నేహల్‌ (సి) పంత్‌ (బి) రసిక్‌ 4, డేవిడ్‌ (ఎల్బీ) ముకేశ్‌ 37, నబి (సి) హోప్‌ (బి) రసిక్‌ 7, చావ్లా (సి) హోప్‌ (బి) ముకేశ్‌ 10, ఉడ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 247/9; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-65, 4-136, 5-140, 6-210, 7-223, 8-234, 9-247; బౌలింగ్‌: లిజాడ్‌ విలియమ్స్‌ 3-0-34-0, ఖలీల్‌ 4-0-45-2, ముకేష్‌ 4-0-59-3, కుల్దీప్‌ 3-0-47-0, అక్షర్‌ 2-0-24-0, రసిక్‌ 4-0-34-3.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 9 8 1 0 16 0.694

కోల్‌కతా 8 5 3 0 10 0.972

హైదరాబాద్‌ 8 5 3 0 10 0.577

లఖ్‌నవూ 9 5 4 0 10 0.059

ఢిల్లీ 10 5 5 0 10 -0.276

చెన్నై 8 4 4 0 8 0.415

గుజరాత్‌ 9 4 5 0 8 -0.974

పంజాబ్‌ 9 3 6 0 6 -0.187

ముంబై 9 3 6 0 6 -0.261

బెంగళూరు 9 2 7 0 4 -0.721

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 28 , 2024 | 01:44 AM