Share News

ఫైనల్లో నవ్య

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:48 AM

భారత జూనియర్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ బాలికల అండర్‌-19 సింగిల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి నవ్య ఫైనల్‌ చేరింది...

ఫైనల్లో నవ్య

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత జూనియర్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ బాలికల అండర్‌-19 సింగిల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి నవ్య ఫైనల్‌ చేరింది. శనివారం గచ్చిబౌలిలోని గోపీచంద్‌ అకాడమీలో జరిగిన సెమీఫైనల్లో నవ్య 18-21, 21-19, 21-13తో భారత్‌కే చెందిన టానూ చంద్రపై నెగ్గింది. బాలుర సింగిల్స్‌లో లక్ష్‌ చెంగప్ప 11-21, 21-14, 21-19తో చియాంగ్‌ చెయి (తైపీ)పై గెలిచి ఫైనల్‌ చేరాడు.

Updated Date - Aug 25 , 2024 | 05:48 AM