Share News

ఈసారి టైటిల్‌ మాదే!

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:40 AM

త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ విజేతపై వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జూన్‌లో అమెరికా-విండీస్‌ సంయుక్తంగా నిర్వహించనున్న మెగా టోర్నీ...

ఈసారి టైటిల్‌ మాదే!

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ విజేతపై వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జూన్‌లో అమెరికా-విండీస్‌ సంయుక్తంగా నిర్వహించనున్న మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొనడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, సొంతగడ్డపై వెస్టిండీస్‌ మరోసారి విజేతగా నిలుస్తుందని రిచర్డ్స్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోచ్‌ డారెన్‌ సామి, కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ సారథ్యంలోని విండీస్‌.. అగ్రశ్రేణి జట్లకు దీటుగా పోటీపడగలదన్నాడు. 2012, 2016ల్లో సామి కెప్టెన్సీలో కరీబియన్లు రెండుసార్లు పొట్టిక్‌పను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - Apr 24 , 2024 | 04:40 AM