Share News

Smartphone: రూ.7 వేలకే 7000mah బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చుశారా

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:11 PM

మీరు తక్కువ ధరల్లో మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఐటెల్ సంస్థ P40+ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.9,999 కాగా, ప్రస్తుతం 31 శాతం తగ్గింపుతో రూ. 6,899కే లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Smartphone: రూ.7 వేలకే 7000mah బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చుశారా
smartphone

మీరు తక్కువ ధరల్లో మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఐటెల్ సంస్థ P40+ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.9,999 కాగా, ప్రస్తుతం 31 శాతం తగ్గింపుతో రూ. 6,899కే ఫ్లిప్‌కార్టులో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనేక ఫోన్‌లు 5000mAh లేదా 6000mAh బ్యాటరీని అందిస్తున్నప్పటికీ itel P40+ మాత్రం బడ్జెట్ ధరల్లో 7000mAh సామర్థ్యంతో వస్తుంది.


ఈ బడ్జెట్ ఫోన్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మంచి పనితీరు కోసం ఇది Unisoc T606 ప్రాసెసర్‌తో అందించబడింది. దాని వెనుక ప్యానెల్‌లో 13MP డ్యూయల్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 7000mAh కెపాసిటీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రత్యేక తగ్గింపుల కారణంగా కస్టమర్లు ఈ ఫోన్‌ను రూ. 7000 కంటే తక్కువ ధరకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో 8GB RAM వరకు సపోర్ట్ ఉంది.


టెక్ బ్రాండ్ ఐటెల్ P40+ ధరను ప్రారంభించిన సమయంలో రూ. 8,099గా నిర్ణయించింది. ఏదైనా బ్యాంకు కార్డు ద్వారా చెల్లింపు చేస్తే మరింత తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో కూడా రూ. 7,200 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐస్ సియాన్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ సహా మరికొన్ని ఆప్ఫన్లు కూడా ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News.

Updated Date - Apr 22 , 2024 | 05:49 PM