Share News

Telangana: రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్

ABN , Publish Date - May 05 , 2024 | 09:24 PM

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా..

Telangana: రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్
KTR vs Revanth Reddy

హైదరాబాద్, మే 05: ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్‌నే రివర్స్‌ కౌంటర్‌గా వేశారు కేటీఆర్. ‘రేవంత్ రెడ్డి.. చీర నువ్వు కట్టుకుంటావా? లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా?’ అంటూ మాస్ కౌంటర్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


అసలేం జరిగిందంటే..

ఆదివారం నాడు కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ. 2,500 వస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను పేర్కొంటూ.. నెలకు రూ. 2,500 ఎక్కడ ఇస్తున్నారు? చూపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? అంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటీఆర్..


‘రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ. 2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం. కేసీఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది. తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి నెలకొంది. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 05 , 2024 | 09:25 PM