Share News

13 తర్వాత కేసీఆర్‌ పని ఖతం

ABN , Publish Date - May 04 , 2024 | 05:29 AM

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ పని ఈ నెల 13 తర్వాత ఖతం అవుతుందని, జూలై 4న ఆయన దుకాణం బంద్‌ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్ర వారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ)

13 తర్వాత కేసీఆర్‌ పని ఖతం

జూలై 4న దుకాణం బంద్‌: మంత్రి కోమటిరెడ్డి

నా కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నా

నాపై పోటీ చేసే వారూ ఆ పని చేయాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న

నల్లగొండ, మే 3: అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ పని ఈ నెల 13 తర్వాత ఖతం అవుతుందని, జూలై 4న ఆయన దుకాణం బంద్‌ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్ర వారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ) స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) నామినేషన్‌ వేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం అంతా చిన్నాభిన్నమైందని, బిడ్డ జైలులో ఉందని ఆయన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ నడుస్తోందని మోదీ అంటున్నారని, అయితే దేశంలో నడిచేది అంబానీ, అదానీల ట్యాక్స్‌ అని విమర్శించారు. రాష్ట్రంలో జీవో 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, ఆ జీవోపై కమిటీ వేసి రద్దు చేస్తామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిపించాలని కోరారు. తనకున్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట అగ్రిమెంట్‌ చేశానని తీన్మార్‌ మల్లన్న ఈ సందర్భంగా ప్రకటించారు. తనపై పోటీ చేసే వారు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతే తనపై పోటీకి దిగాలని సవాల్‌ విసిరారు. ఈ మేరకు అగ్రిమెంట్‌ చేయించిన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేసి ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తీన్మార్‌ మల్లన్న దంపతులకు రూ.1.50కోట్ల ఆస్తులు, రూ.31లక్షల అప్పులున్నాయి. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఆయన తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మల్లన్న పేరుపై రూ.16,34 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉండగా ఆయన భార్య మాతమ్మ పేరుపై రూ.1,34 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తీన్మార్‌ మల్లన్నపై రాష్ట్రంలోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో 56 కేసులు నమోదు కాగా, వివిధ కోర్టుల్లో 26 కేసులు విచారణ దశలో ఉన్నాయి.


ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

నల్లగొండటౌన్‌: ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దా ఖలు చేశారు. తీన్మార్‌ మల్లన్న రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్‌రెడ్డి, చాలిక చంద్రశేఖర్‌, అలయన్స్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరిరావు, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - May 04 , 2024 | 05:29 AM