Share News

అప్రూవర్లను అనుమానిస్తే.. కోర్టును తప్పు పట్టినట్టే

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:26 AM

కోర్టు అనుమతితోనే ఢిల్లీ మద్యం కేసు నిందితులు అప్రూవర్లుగా మారారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) న్యాయస్థానానికి స్పష్టం చేసింది. అప్రూవర్లను అనుమానిస్తే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టినట్టేనని పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసులో

అప్రూవర్లను అనుమానిస్తే.. కోర్టును తప్పు పట్టినట్టే

కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు

కవితే ఉద్దేశపూర్వకంగానే 10 ఫోన్లను ఫార్మాట్‌ చేశారు

కవితకు బెయిలిస్తే కేసుపై ప్రభావం!

రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కోర్టు అనుమతితోనే ఢిల్లీ మద్యం కేసు నిందితులు అప్రూవర్లుగా మారారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) న్యాయస్థానానికి స్పష్టం చేసింది. అప్రూవర్లను అనుమానిస్తే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టినట్టేనని పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌.. ఈ కేసులో కవితే సూత్రధారి, పాత్రధారి అని, ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని వాదించారు.

ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ సమయంలో కవితకు బెయిల్‌ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ కేసులో మనీశ్‌ సిసోడియా, కేజ్రీవాల్‌తోపాటు ఇతరకు బెయిల్‌ దక్కలేదని.. సుప్రీంకోర్టు సైతం ఈ కేసులో బెయిల్‌ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ుూకవిత సూచనలు, సలహాల మేరకే మద్యం విధానం రూపుదిద్దుకుంది. ఇదెంతో పకడ్బందీ ప్రణాళికలతో చేసిన స్కాం. మొదటి నుంచీ కేసును పక్కదారి పట్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లను ప్రలోభపెట్టారని అనడం సరికాదు. వారిని అనుమానించడం అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టినట్టే. రాజకీయ కోణంలోనే అప్రూవర్లపై ఆరోపణలు చేస్తున్నారు.్‌్‌ అని జోహెబ్‌ హుేస్సన్‌ తెలిపారు. అలాగే.. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలో డేటాను డిలీట్‌ చేశారని.. ఈడీకి ఇచ్చిన 10 ఫోన్లనూ ఫార్మాట్‌ చేసే ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


సాక్షులను బెదిరించారు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని జోహెబ్‌ హుస్సేన్‌ వాదించారు. ుూకవిత ప్రాక్సీనంటూ అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. కానీ, కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత.. అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నారు. కవిత ఒత్తిడితోనే ఆయన యూ టర్న్‌ తీసుకున్నారు. కవిత, కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా మధ్య అవగాహన ఉందని బుచ్చిబాబు ేస్టట్మెంట్‌ ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిశారు. కవితను కలవాలని కేజ్రీ సూచించడంతో.. హైదరాబాద్‌లో ఆయన కవితను కలిశారు. కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు అడుగుతున్నారని శ్రీనివాసులు రెడ్డికి తెలిపిన కవిత.. రూ.50 కోట్లు ముందుగా ఇవ్వాలని ఆయన్ను కోరారు. కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పనిచేశారు.్‌్‌ అని జోహెబ్‌ కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్‌ చాట్స్‌లో సాక్ష్యాధారాలు దొరినట్లు వెల్లడించారు. అనంతరం అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ సాక్ష్యాలను ధ్రువీకరించారని తెలిపారు. ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో కవిత లబ్ధి పొందారని వాంగ్మూలాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. అలాగే.. ఈ కేసులో కవిత మేనల్లుడు మేక శరణ్‌ను హైదరాబాద్‌లో ఈడీ విచారించిందని.. అతణ్ని ఇండో స్పిరిట్‌ ఉద్యోగిగా చూపి.. ఏ రోజూ ఉద్యోగానికి హాజరు కాకున్నా నెలకు రూ.లక్ష జీతం చెల్లించారని వెల్లడించారు. ఈ కేసులో చేతులు మారిన రూ.100 కోట్లకు సంబంధించి మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వాంగ్మూలం అందించారని తెలిపారు. అరబిందో కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి అమాయకుడు కాదని, ఈ వ్యాపారంలో ఆయన ప్రధాన లబ్ధిదారుడని స్పష్టం చేశారు. ఈ (మద్యం) పాలసీ ద్వారా ఆయన ఐదు రిటైల్‌ జోన్లు పొందారని పేర్కొన్నారు.


ఇద్దరు బెయిల్‌పైనే ఉన్నారు..

కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరై, ఈడీ వాదనలను తప్పుబట్టారు. ఈ కేసులో ఇద్దరు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని.. అయినా, ఇది ఫైనల్‌ ఆర్గ్యుమెంట్‌ కాదని.. కేవలం బెయిల్‌ పిటిషన్‌ పై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. బెయిల్‌ పిటిషన్‌పై మూడురోజుల నుంచి ఈడీ వాదనలు వినిపించడం సరికాదన్నారు. తమ వాదనలను లిఖితపూర్వకంగా రిజాయిండర్‌ రూపంలో దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. అందరి వాదనలూ విన్న న్యాయమూర్తి కావేరీ భవేజా.. బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేశారు. కాగా.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు.. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు.

Updated Date - Apr 25 , 2024 | 04:27 AM