Share News

TS News: అధికారిక ఉత్తర్వులు ఉన్నప్పటికీ హనుమాన్ జయంతి రోజున మద్యం అమ్మకాలు...

ABN , Publish Date - Apr 24 , 2024 | 10:43 AM

Telangana: నగరంలో నిన్న (మంగళవారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గౌలీగూడలోని రామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అశేష భక్తజనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

TS News: అధికారిక ఉత్తర్వులు ఉన్నప్పటికీ హనుమాన్ జయంతి రోజున మద్యం అమ్మకాలు...
Liquor Sale on Hanuman Jayanthi

హైదరాబాద్, ఏప్రిల్ 24: నగరంలో నిన్న (మంగళవారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గౌలీగూడలోని రామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అశేష భక్తజనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నిన్నటి రోజున మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం (Telangana Government) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు విరుద్ధంగా మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరికలు ఇచ్చింది.

Purandeshwari: దళిత యువకుల మృతికి కారణమైన హోంమంత్రిని ప్రజలు తిప్పికొట్టాలి


నిబంధనలు తుంగలోతొక్కి...

అయితే ప్రభుత్వం ఉత్తర్వులను కొందరు పెడచెవిన పెట్టారు. మద్యం దుకాణాలు తెరవొద్దని అధికారిక ఆదేశాలు ఉన్నప్పటికీ పలువురు అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టారు. వీరిపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కొరడా ఝుళిపించారు. హనుమాన్ జయంతి రోజున నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం అమ్ముతున్న సైబరాబాద్‌లోని 22 ప్రదేశాలలో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. దాదాపు రూ. 2,01,093 విలువగల 448 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ అమ్మకాలకు సంబంధించి మొత్తం 22 మందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


నమోదైన కేసులు ఎన్నంటే?...

ఎస్‌వోటీ మేడ్చల్ టీమ్ - 6 కేసులు

ఎస్‌వోటీ బాలానగర్ టీమ్ - 5 కేసులు

ఎస్‌వోటీ రాజేంద్రనగర్ టీమ్ - 5 కేసులు.

ఎస్‌వోటీ మాదాపూర్ టీమ్ - 4 కేసులు

ఎస్‌వోటీ శంషాబాద్ టీమ్ - 2 కేసులు

Hyderabad: వేడి గాలులతో డేంజర్‌.. ఒంట్లో నీటి శాతం తగ్గి అస్వస్థత


ఒకేనెలలో రెండు సార్లు...

కాగా.. ఇటీవల శ్రీరామ నవిమి రోజున కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆర్డర్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల 17 ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 18 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడ్డాయి. అలాగే ఈనెల 21న మమావీర్ జయంతిని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా మటన్, చికెన్ షాపు బంద్ అయ్యాయి. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Elections: రెండో దశ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు..స్టార్ క్యాంపెయినర్లు సిద్ధం

BRS: మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటా: వెంకట్రామ్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 10:46 AM