Share News

Crime.. హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 08:58 AM

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో అర్థరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.

Crime.. హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

హైదరాబాద్: ఫిలింనగర్‌ (Philim Nagar)లోని మూన్‌షైన్ పబ్‌ (Moonshine Pub)లో అర్థరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం (Crime) సృష్టించారు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు (Youth) ఓ యువతి (Woman)తో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 09:14 AM