Share News

Hyderabad: అతి తక్కువ సెకండ్ హ్యాండ్ వస్తువులు.. వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:21 PM

హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ షాప్ వారు మాత్రం పాత వస్తువులను సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకున్న వారికి ఇది బెస్ట్ స్పాట్.

Hyderabad: అతి తక్కువ సెకండ్ హ్యాండ్ వస్తువులు.. వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే

హైదరాబాద్: మన ఇళ్లలో చాలా వస్తువులు ఏళ్ల తరబడి వాడుతూ ఉంటే ఏదో ఒక రోజు మరమ్మతులకు గురవుతాయి. వాటిని చాలా మంది బయట పడేస్తుంటారు. మరికొందరు మరమ్మతులు చేయించుకుని ఇంకొన్నాళ్లు వాడుకుంటారు. అయితే హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ షాప్ వారు మాత్రం పాత వస్తువులను సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకున్న వారికి ఇది బెస్ట్ స్పాట్.

బండ్లగూడలో ఆరాంఘర్ చాంద్రాయణ గుట్టతో కలిపే రహదారి పక్కన సఫా బైతుల్ మాల్(SBM) అనే రిపేర్ షాప్ ఉంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులను రిపేర్ చేస్తారు. వీటిల్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు వస్తువులు ఉంటాయి. ఈ దుకాణాన్ని సఫా బైతుల్ మాల్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. ఇళ్లల్లో పాడైపోయిన వస్తువులను సేకరించి వాటిని పడేయడానికి బదులు మరమ్మతులు చేసి తిరిగి విక్రయిస్తారు.


అవికూడా అతి తక్కువ ధరలో. అలా సమకూరిన డబ్బును సామాజిక సేవ కోసం వినియోగిస్తారు. ఈ దుకాణంలో ఎవరైనా సెకండ్‌హ్యాండ్ ఫర్నీచర్, గృహోపకరణాలు, పరుపులు, ఫిట్‌నెస్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు. సఫా బైతుల్ మాల్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజార్ మాట్లాడుతూ.. చాలా మంది పాడైపోయిన వస్తువులను చెత్తలో వేయడాన్ని గమనించానని.. వాటిని సేకరించి మరమ్మతులు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగిందని అన్నారు. అందులో భాగంగానే షాప్‌ని ప్రారంభించినట్లు చెప్పారు.

“మొదట్లో పాత వార్తాపత్రికలు, పుస్తకాలను సేకరించాం. కానీ చాలా కుటుంబాలు మరమ్మతులకు గురైన ఇతర వస్తువులు కూడా తీసుకోవాలని మమ్మల్ని కోరాయి. వాటిని సేకరించి రిపేర్ చేసి అమ్మాలనుకున్నాం. అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం” అని అజహర్ చెప్పారు. సఫా బైతుల్ మాల్ (SBM) ఓ కాల్ సెంటర్‌ను కూడా నడుపుతుంది. షాప్ అడ్రస్ వివరాలు, వస్తువుల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఫోన్ కాల్‌లో సంప్రదించవచ్చు.


హైదరాబాద్ పరిధిలోని మీ ఇంట్లో పాడైపోయిన వస్తువులేమైనా ఉంటే ఆటోను ఇంటి వద్దకే పంపుతారు. వాటిని షాప్‌నకు తీసుకెళ్లి రిపేర్లు చేస్తారు. ఎస్బీఎంలో ప్రస్తుతం 40 మంది పని చేస్తున్నారని.. వారంతా రిపేర్ అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులను వర్క్‌షాప్‌నకు పంపిస్తారని అజహర్ చెప్పారు.

RTC Bus Drivers: ఎండలతో బేజారు.. హడలిపోతున్న ఆర్టీసీ బస్‌డ్రైవర్లు

మరమ్మతుల అనంతరం వాటిని దుకాణంలో కొనుగోలుకు ఉంచుతామని తెలిపారు. అలా వచ్చిన డబ్బును అనాథ విద్యార్థుల చదువులకు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడానికి, కిరాణా సామగ్రి అందించడానికి తదితర సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 01:22 PM