Share News

మావోయిస్టు సుధాకర్‌ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:17 AM

ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ కుటుంబానికి అండగా ఉంటామని పంచాయతీరాజ్‌,

మావోయిస్టు సుధాకర్‌ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క

చిట్యాల, ఏప్రిల్‌ 24: ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ కుటుంబానికి అండగా ఉంటామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి బుధవారం చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలోని సుధాకర్‌ నివాసానికి ఆమె వెళ్లారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. తొలుత సుధాకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాకర్‌ తల్లి రాజపోచమ్మను ఓదార్చి ఽధైర్యం చెప్పారు. సీతక్కతో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, టేకుమట్ల జడ్పీటీసీ సభ్యుడు పులి తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:17 AM