Share News

ఆరో రోజు 42 నామినేషన్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:24 AM

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరో రోజు బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలకు 42నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 22 మంది అభ్యర్థులు, భువనగిరి స్థానానికి 20 మంది నామినేషన్లు దాఖలు చేశా రు.

ఆరో రోజు 42 నామినేషన్లు

నల్లగొండ స్థానానికి 22 8 భువనగిరికి 20 దాఖలు

నల్లగొండటౌన్‌, భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 24 (ఆంద్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరో రోజు బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలకు 42నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 22 మంది అభ్యర్థులు, భువనగిరి స్థానానికి 20 మంది నామినేషన్లు దాఖలు చేశా రు. నల్లగొండ స్థానానికి బీఆర్‌ఎస్‌ తరపున కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్లు, బీజేపీ తరపున నూకల నరసింహారెడ్డి రెండు సెట్లు, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ఆయన మద్దతుదారులు ఒకసెట్‌, కాంగ్రెస్‌ పార్టీ తరపున కుందూరు రఘువీర్‌రెడ్డి మూడు సెట్లు, కుందూరు జానారెడ్డి రెండు సెట్లు, ధర్మసమాజ్‌ పార్టీ తరపున తలారి రాంబాబు ఒక సెట్‌, బహుజన్‌ సమాజ్‌ పా ర్టీ తరపున విరిగినేని అంజయ్య ఒక సెట్‌, తెలంగాణ సకల జనుల పార్టీ తరపున నందిపాటి జానయ్య రెండు సెట్లు నామినేషన్లు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ త రపున చిలుక రామ్‌బాబు ఒక సెట్‌ నామినేషన్‌ అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా శిరసాల శ్రీనయ్య, అఖిల్‌ సంపంగి, పాలకూరి రమాదేవి, పాలకూరి ర వి,గోలి సైదులు, పోతుల యాదగిరి, పోతుల ప్రార్థన, కుందారపు శ్రీకాంత్‌, గం గిరెడ్డి కోటిరెడ్డి, నూనె సురేష్‌, షేక్‌ ఉస్మాన్‌ బాబా, ధరావత్‌ మోతీలాల్‌, అంజనపల్లి రవిలు నామినేషన్లు దాఖలుచేశారు. నల్లగొండ పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు.

భువనగిరి పార్లమెంట్‌ స్థానానికి యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్‌), క్యామ మల్లేశ్‌(బీఆర్‌ఎ్‌స), బట్టుపల్లి అనురాధ(సీపీఐ(ఎం), తరిగొప్పుల మహేందర్‌(సోషల్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ), కొత్తోజు శ్రీనివా్‌స(నేషనల్‌ మహాసభ పార్టీ), పూస శ్రీనివా్‌స(టీఎస్‌ పునర్నిర్మాణ పార్టీ), నామిని భాస్కర్‌(ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ), ముసునూరి గ ణేష్‌(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), మణిపాల్‌రెడ్డి(తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ), పులిగిల్ల బిక్షపతి(నేషనల్‌ నవక్రాంతి పార్టీ), పల్లెల మైసయ్య(స్వదేశీ కాంగ్రెస్‌ జాతీయ పార్టీ), కొంగరి లింగస్వామి(ధర్మసమాజ్‌ పార్టీ), నల్ల కరుణాకర్‌రెడ్డి(జైభారత్‌ నేషనల్‌ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులుగా జంగ సుజాత, బొల్లారం బాలరాజు, ఈదుల వీరపాపయ్య, నక్కల నరేంద ర్‌, ఏమిరెడ్డి రవికిరణ్‌రెడ్డి, కన్నె రామరాజు, పోతుల యాదగిరి నామినేషన్లు దాఖ లు చేశారు. నామినేషన్లను ఎన్నికల అధికారి, యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ హన్మంతు కే జెండగే స్వీకరించారు.

నామినేషన్‌ కౌంటర్‌

నియోజకవర్గం 24న గతంలో మొత్తం

దాఖలు దాఖలు

నల్లగొండ 22 33 55

భువనగిరి 20 42 62

మొత్తం 42 75 117

Updated Date - Apr 25 , 2024 | 12:24 AM