Share News

ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:56 PM

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు కూర్చున్న చోటు నుంచే నిమిషాల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసే అవకాశం ఉంది. అదే సమయంలో నచ్చి న వస్తువును ఇష్టమైన స్టోర్స్‌ లేదా ప్రదేశం నుం చి కొనుగోలు చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌

సైబర్‌ నేరాల నియంత్రణ, బాధితులకు అండగా ఉండటమే లక్ష్యం

పోలీ్‌సశాఖలో అందుబాటులోకి కొత్త వ్యవస్థ

ఒకే రకమైన సేవలకోసం 5ఎస్‌ విధానం అమలు

భువనగిరి టౌన్‌, సూర్యాపేటక్రైం: చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు కూర్చున్న చోటు నుంచే నిమిషాల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసే అవకాశం ఉంది. అదే సమయంలో నచ్చి న వస్తువును ఇష్టమైన స్టోర్స్‌ లేదా ప్రదేశం నుం చి కొనుగోలు చేసుకునే సదుపాయం కూడా ఉంది. అంతేగాక డిజిటల్‌ రూపంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు కూడా మొబైల్‌ ఫోన్‌ నుం చే పెడుతున్నారు. ఇదే అదనుగా వివిధ యాప్స్‌, వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతున్న ఆఫర్లకు పలువురు అత్యాశ తో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. దీంతో సివిల్‌, క్రిమినల్‌ నేరాల సంఖ్య తో పోటీపడే లా సైబర్‌ నేరాలు క్రమేపీ పెరుగుతున్నా యి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర పోలీ్‌సశాఖ ప్రతీ పోలీ్‌సస్టేషన్‌కు సైబర్‌ వారియర్‌ను ఏర్పాటుచేసిం ది. అదేవిధం గా పోలీ్‌సస్టేషన్లలో నాణ్యమైన సేవల కోసం 5ఎస్‌ విధానాన్ని అమలు చేస్తోంది.

డిజిటల్‌ లావాదేవీలు, పెట్టుబడులపై కనీస అవగహన కొరవడి న వారే అధికంగా సైబర్‌ నేరాలబారిన పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది. అయితే సైబర్‌ నేరాలపై వస్తున్న ఫిర్యాదుల పై పోలీసులు స్పందించి కేసు నమోదు చేస్తున్నారు. అంతేగాక పలువురు నిందితులను అదుపులోకి తీసుకొని కాజేసిన మొత్తాన్ని రికవరీ చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయినా సైబర్‌ నేరాల బాధితులకు పూర్తిస్థాయిలో జరుగుతున్న న్యాయం అంతంత మాత్ర మే. బాధితులు ఫిర్యాదులు చేయని పక్షంలో తామేం చేయగలమని పోలీసులు అంటున్నారు. సైబర్‌ నేరాలపై ఫిర్యాదుకు ఇప్పటివరకు నాలుగు అంకెల టోల్‌ఫ్రీ నెంబర్‌ మాత్రమే అందుబాటులో ఉండగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటే హైదరాబాద్‌ నగరంలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల నియంత్రణకు, మోసపోతున్న బాధితులకు అండగా ఉండేలా రాష్ట్ర పోలీ్‌సశాఖ సైబర్‌ వారియర్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. నూతన వ్యవస్థ ద్వారా ఇక నుంచి ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ఒక సైబర్‌ వారియర్‌ ఉంటారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్లో పరిధిలో సైబర్‌ వారియర్స్‌ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తుండటంలోపాటు ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు న్యాయం జరగేలా ప్రయత్నిస్తారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లోని యాదాద్రి జోన్‌ పరిధిలో 18 పోలీ్‌సస్టేషన్లో పనిచేస్తున్న 18 మంది కానిస్టేబుళ్ల ను సైబర్‌ వారియర్స్‌గా నియమించారు. ప్రతీ సైబర్‌ వారియర్‌కు ప్ర త్యేకంగా ఒక సెల్‌ఫోన్‌ను కేటాయించారు. ఇకనుంచి సైబర్‌ నేరాల బాధితులు నేరుగా స్థానికంగా ఉండే వారియర్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

స్థానికంగా ఫిర్యాదుల స్వీకరణ

సైబర్‌ నేరాల బాధితులు ఇక నుంచి వారి ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌లోని సైబర్‌ వారియర్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. వారు వెంటనే వివరాలను నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో నమోదు చేస్తారు. కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధితులకు తెలియజేస్తారు. అలాగే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930కు కూడా ఫోన్‌ చేసి సైబర్‌ నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. 1930కు ఫోన్‌ చేసిన వెంటనే ఈ వివరాలు స్థానిక సైబర్‌ వారియర్‌కు చేరుతాయి.

పోలీ్‌సస్టేషన్లలో 5ఎస్‌ విధానం

రాష్ట్ర ప్రజలందరికీ ఒకేరకమైన సేవలందించేందుకు పోలీ్‌సశాఖ 5 ఎస్‌ విధానాన్ని అమలుచేస్తోంది. న్యాయం కోసం స్టేషన్‌కు రిక్షాలో వచ్చినా,కారులో వచ్చినా ఒకే రకమైన సేవలందించి ప్రజల్లో పోలీ్‌సశాఖపై భరోసా కల్పించేందుకు యత్నిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న పోలీ్‌సశాఖ స్టేషన్ల పరిస్థితిపై దృష్టిసారించింది. 5ఎస్‌ విధానంలో స్టేషన్లలోని ఫైళ్లన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఫైల్‌ ఎప్పుడు కావాలంటే అప్పు డు దొరికే వెసులుబాటు ఉంటుంది. స్టేషన్లలో రిసెప్షన్‌ కౌంటర్లు, వా హనాల పార్కింగ్‌, పార్కింగ్‌ బోర్డు, పరిశుభ్రత, సీజ్‌ చేసిన వాహనాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయడంలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం అన్ని పోలీ్‌సస్టేషన్లలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నారు.

వర్టికల్స్‌ విభాగాలు కూడా

పోలీ్‌సశాఖలో ప్రతీ స్టేషన్‌లో 17 వర్టికల్స్‌ విభాగాలకు సంబంధిం చి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందులో రిసెప్షన్‌ సిబ్బంది, స్టేషన్‌ రైటర్‌, క్రైమ్‌ కేసులకు సంబంధించి రైటర్‌, బ్లూకోట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది, కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది, వారెంట్లను హాజరు పర్చే సిబ్బంది, కోర్టు సమన్లను జారీ చేసే సిబ్బంది, టెక్నికల్‌ టీం, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌, క్రైమ్‌ సిబ్బంది, ఆసుపత్రుల నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చే సిబ్బంది, వాచ్‌డ్యూటీ సిబ్బంది, జనరల్‌ డ్యూటీ సిబ్బంది, స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌, స్టేషన్‌ పరిపాలన అధికారితో కూడిన విభాగాలకు సంబంధించి విధులను నిర్వహిస్తున్నారు. ప్రతీ విభాగానికి సంబంధించిన సిబ్బంది, అధికారులకు పోలీ్‌సశాఖ రోజు వారి విధులకు సంబంధించి ఇప్పటికే వివరాలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఎవరి విధులను వారు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

5ఎస్‌ విధానంలో పేట పోలీసులకు అవార్డులు

రాష్ట్రంలో పోలీ్‌సశాఖలో 5ఎస్‌ విధానం అమలు విషయంలో సూర్యాపేట జిల్లా పోలీస్‌ నిరంతరం ప్రతిభ చూపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు ప్రథమ స్థానంలో జిల్లా పోలీస్‌ నిలిచింది. అందుకు గత ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు.

అన్ని స్టేషన్లలో అమలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్లలో 5ఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నా రు. 5ఎస్‌ విధానం అంటే సార్టింగ్‌, సెట్‌ ఇన్‌ ఆర్డర్‌, షైనింగ్‌, స్టాండర్డయిజ్‌, సస్టేయిన్‌. సార్టింగ్‌ అంటే పోలీ్‌సస్టేషన్లలో అవసరం ఉన్న, అవసరం లేని ఫైల్స్‌, వస్తువులను ఒకే దగ్గర ఏర్పాటు చేయడం. అత్యవసర సమయంలో ఫైల్స్‌ వెంటనే దొరికేందుకు క్రమ పద్ధతిలో అమర్చడం. అవసరం లేని పైల్స్‌ను గుర్తించి వాటిని మరోచోట ఉంచడం చేస్తారు. సెట్‌ ఇన్‌ ఆర్డ ర్‌ అంటే పోలీస్‌ స్టేషన్లలో ఉండే పైల్స్‌, వస్తువులు వెంటనే దొరికేలా క్రమ పద్ధతిలో ఏర్పా టు చేస్తారు. షైనింగ్‌ అంటే పోలీ్‌సస్టేషన్‌ పరికరాలతో పాటు ఇతర పోలీస్‌ సామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు స్టేషన్‌ వాతావరణం ఆహ్లాదరకంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. స్టాండర్డయిజ్‌ అంటే స్టేషన్‌లోని ముఖ్యమైన వస్తువులు, ఫైల్స్‌ను నిరంతరం ఒక నిర్దిష్ట ప్రదేశంలో భద్రపరుస్తారు. ఉమ్మడి జిల్లాలో 5ఎస్‌ విధానాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నారు. స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా స్టేషన్లకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించారు. అదే విధంగా స్టేషన్లలో అధికారులు, సిబ్బందితో పాటు స్టేషన్‌కు వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వెళ్లగానే కనిపించేలా రిసెప్షన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలకు వారి ఇబ్బందులను చెబితే రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉండే సిబ్బంది వారికి అవగాహన కల్పించి ఫిర్యాదు రాయిస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ దరఖాస్తును రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద నమోదు చేసుకొని రశీదు కూడా ఇస్తున్నారు.

ఒకే రకమైన సేవలందించేందుకు చర్యలు : రాహుల్‌హెగ్డే, సూర్యాపేట జిల్లా ఎస్పీ

న్యాయం కోసం పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ప్రతీ ఒక్కరికి తారతమ్యాలు లేకుండా ఒకే రకమైన సేవలందించేందుకు చర్యలు చేపట్టాం. డీజీపీ ఆదేశాల మేరకు స్టేషన్లలో 5ఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా స్టేషన్లన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నాం. అంతేకాకుండా పోలీస్‌ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధులను రోజు వారీగా సక్రమంగా నిర్వహిస్తున్నారు. పోలీ్‌సశాఖలో క్రమ శిక్షణ కూడా మరింత పెరిగింది.

బాధితులకు అండగా సైబర్‌ వారియర్స్‌ : ఎం.రాజే్‌షచంద్ర, యాదాద్రి డీసీపీ

యాదాద్రి జోన్‌ సైబర్‌ వారియర్స్‌ సైబర్‌ నేరాల బా ధితులకు అండగా ఉండనున్నారు. అవగాహనా రాహి త్యం, సులభ సంపాదన లక్ష్యంగా డిజిటల్‌ పెట్టుబడుల రూపంలో నష్టపోతున్న బాధితులకు సైబర్‌ వారియర్స్‌ ద్వారా న్యా యం జరగనుంది. స్థానికంగా ఫిర్యాదు చేసే అవకాశం లభించింది. అంతేగాక కేసు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అవగాహన లేనివారు డిజిటల్‌ కోనుగోలు, పెట్టుబడులకు దూరంగా ఉండటం క్షే మం.జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్లో సైబర్‌ వారియర్స్‌ అందుబాటులో ఉన్నారు.

యాదాద్రి జోన్‌ సైబర్‌ వారియర్స్‌ వివరాలు

పోలీస్‌స్టేషన్‌ సెల్‌ నెంబర్‌

భువనగిరి టౌన్‌ 8712665896

భువనగిరి రూరల్‌ 8712665897

బీబీనగర్‌ 8712665899

బొమ్మలరామారం 8712665898

యాదగిరిగుట్ట 8712665900

ఆలేరు 8712665903

రాజాపేట 8712665902

తుర్కపల్లి 8712665901

మోటకొండూరు 8712666904

గుండాల 8712535722

వలిగొండ 8712665910

పోచంపల్లి 8712665907

మోత్కూరు 8712665912

చౌటుప్పల్‌ 8712665906

నారాయణపూర్‌ 8712665908

రామన్నపేట 8712665909

అత్మకూరు 8712665911

అడ్డగూడూరు 8712665913

Updated Date - Apr 27 , 2024 | 11:56 PM