Share News

కొండగడప విద్యార్థినికి అరుదైన అవకాశం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:05 AM

హైద్రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అనువర్తిత భాషా శాస్త్ర అధ్యయనాల కేంద్రం, తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన విద్యార్థిని దొండ స్వాతి పరిశోధన పత్రం సమర్పించారు.

కొండగడప విద్యార్థినికి అరుదైన అవకాశం

మోత్కూరు, ఏప్రిల్‌ 27: హైద్రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అనువర్తిత భాషా శాస్త్ర అధ్యయనాల కేంద్రం, తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన విద్యార్థిని దొండ స్వాతి పరిశోధన పత్రం సమర్పించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తణుకు బాలసరస్వతి సమాజ ప్రాచ్య కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్‌ చెరువు సత్యనారాయణ శాసి్త్ర రచించిన ‘సుబ్బలచ్చిమి శతకం భాషా పరిశీలన’ అన్న అంశంపై పరిశోధన పత్రం సమర్పించానన్నారు. కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మానవీయ శాసా్త్రల విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.కృష్ణ, తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్‌ దార్ల వెంకటేశ్వర్‌రావు, రాజ్యరమ, బాణాల భుజంగరెడ్డి, పిల్లలమర్రి రాములు, కస్తూరి విశ్వనాథం, పింగళి శైలజ, డి.విజయలక్ష్మి పాల్గొన్నారన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:05 AM