Share News

బెట్టింగ్‌కు బ్యాంక్‌ డబ్బులు వాడిన క్యాష్‌ ఇనచార్జి అరెస్ట్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:39 AM

ఆనలైన బెట్టింగ్‌కు పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్‌ నుంచి నగదును అపహరించిన క్యాష్‌ ఇనచార్జిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

బెట్టింగ్‌కు బ్యాంక్‌ డబ్బులు వాడిన క్యాష్‌ ఇనచార్జి అరెస్ట్‌
అనిల్‌కుమార్‌

వలిగొండ, ఏప్రిల్‌ 24 : ఆనలైన బెట్టింగ్‌కు పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్‌ నుంచి నగదును అపహరించిన క్యాష్‌ ఇనచార్జిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేటకు చెందిన కాలేరు అనిల్‌ కుమార్‌ మండలకేంద్రంలోని ఎస్‌బీఐ వలిగొండ బ్యాంకు లో క్యాష్‌ ఇనచార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 16 నుంచి విధులకు హాజరుకాకపోవడంతో ఆ మరుసటి రోజున బ్యాంక్‌ మేనేజర్‌ మౌనిక సిబ్బంది సహకారంతో అతడి కేబినను తనిఖీ చేయగా రూ.15,50,000 నగదు తేడా ఉన్నట్లు గుర్తించారు. సదరు క్యాష్‌ ఇనచార్జి నగదును అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరంచేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్ర్టాంగ్‌ రూం, ఏటీఎం, బంగారు రుణాలపై అంతర్గత తనిఖీ చేపట్టగా మొత్తం రూ.37,63,000 నగదు దుర్వినియోగం అయినట్లు నిర్ధాంచారు. ఆ డబ్బును అనిల్‌కుమార్‌ ఆనలైన బెట్టింగులో పెట్టినట్లు వెల్లడైంది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:39 AM