Share News

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:23 AM

ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలిక లే పైచేయి సాధించారు. ఇంటర్‌ ఫలితాలను ప్రభు త్వం బుధవారం ప్రకటించగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా బాలికలు సత్తాచాటా రు. జనరల్‌తోపాటు, ఒకేషనల్‌ విభాగాల్లో అమ్మాయిలు రాణించారు.

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

కోదాడ,నల్లగొండ, భువనగిరి అర్బన్‌, ఏప్రి ల్‌ 24: ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలిక లే పైచేయి సాధించారు. ఇంటర్‌ ఫలితాలను ప్రభు త్వం బుధవారం ప్రకటించగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా బాలికలు సత్తాచాటా రు. జనరల్‌తోపాటు, ఒకేషనల్‌ విభాగాల్లో అమ్మాయిలు రాణించారు. నల్లగొండ జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో మొత్తం 11,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,610 మంది ఉత్తీర్ణత (57.2శాతం) సాధించారు. ఒకేషన ల్‌ ప్రథమ సంవత్సరంలో 1,351మంది బాలురు పరీక్ష రాయగా 500మంది (37.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ విభాగంలో మొత్తం 11,474 మంది పరీక్షకు హాజరుకాగా, 7,854 మంది (68.45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషన్‌లో 2,167 మంది పరీక్ష రాయగా, 1,335 మంది (61.61శాతం) ఉత్తీర్ణత సాధించారు. జనర ల్‌ విభాగంలో గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 21వ స్థానంలో ఉన్న నల్లగొండ జిల్లా ఈ సారి ప్రథమ సంవత్సరంలో 14వ స్థానం,ద్వితీయ సంవత్సరంలో 10వస్థానంలో నిలిచింది.

యాదాద్రి జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్స రం జనరల్‌ విభాగంలో 4,561మంది పరీక్ష రాయ గా, 2,328మంది (51.04శాతం) ఉత్తీర్ణత సాధించా రు. ఒకేషనల్‌ విభాగంలో 1,549మంది పరీక్షకు హా జరుకాగా, 646 మంది (41.7శాతం) మంది ఉత్తీర్ణ త సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 4,446మంది పరీక్షకు హాజరుకాగా, 2,785 మంది (62.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 1,311మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో 708మంది (54శాతం) ఉత్తీర్ణత సాధించా రు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితా ల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా 26వ స్థానంలో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 25వస్థానంలో నిలిచింది.

సూర్యాపేట జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 6,637మంది పరీక్ష రాయగా, 3,280మంది (49.42శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 1,654మంది పరీక్ష రాయగా, 660మంది (39.9శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 6,063మంది పరీక్ష రాయగా, 3,804మంది (62.74శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 1,487మంది పరీక్షకు హాజరుకాగా, 794మంది (53.04శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో పేట జిల్లా రాష్ట్రస్థాయిలో 28వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 24వ స్థానంలో నిలిచింది.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో ఉత్తీర్ణత ఇలా..

జిల్లా బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం

నల్లగొండ 5,319 2,539 47.73 6,236 4,071 65.28 11,555 6,610 57.79

సూర్యాపేట 3,096 1,244 40.18 4,290 2,497 58.21 6,637 3,280 49.42

యాదాద్రి 2,096 887 42.32 2,465 1,441 58.46 4,561 2,328 51,04

ఒకేషనల్‌ విభాగంలో ఉత్తీర్ణత ఇలా..

జిల్లా బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం

నల్లగొండ 1,351 500 37.01 991 636 64.18 2,342 1,136 48.05

సూర్యాపేట 1,020 283 27.5 625 377 60.32 1,654 660 39.09

యాదాద్రి 788 198 25.13 761 448 58.87 1,549 646 41.07

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో ఉత్తీర్ణత ఇలా..

జిల్లా బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం

నల్లగొండ 5,390 3,337 61.91 6,084 4,517 74.24 11,474 7,854 68.45

సూర్యాపేట 2,667 1,441 54.03 3,396 2,363 69.58 6,063 3,804 62.74

యాదాద్రి 2,035 1,134 55.72 2,411 1,651 68.48 4,446 2,785 62.64

ఒకేషనల్‌ విభాగంలో ఉత్తీర్ణత ఇలా..

జిల్లా బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం

నల్లగొండ 1,198 579 48.33 969 756 78.02 2,167 1,335 61.61

సూర్యాపేట 913 374 40.96 574 420 73.17 1,487 794 53.04

యాదాద్రి 679 237 34.09 632 471 74.53 1,311 708 54.00

Updated Date - Apr 25 , 2024 | 12:23 AM