Share News

రంజుగా రాజకీయం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:02 AM

లోక్‌సభ ఎన్నికల సమరం వేడెక్కుతున్న తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజుకో తీరుగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వర్గపోరుతో సతమతమవుతుంటే, కాంగ్రె్‌సలోనూ భిన్నపరిస్థితి నెలకొంది.

రంజుగా రాజకీయం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలో రోజుకో తీరు పరిణామాలు

బీఆర్‌ఎ్‌సలో గుత్తా వర్గీయుల భిన్నస్వరం

కాంగ్రె్‌సలో ఆసక్తికర పరిణామాలు

మిర్యాలగూడలో చేరికలను అడ్డుకున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ వర్గీయులు

క్యాడర్‌ నిరసనతో చేరికలపై వెనక్కితగ్గిన అధిష్ఠానం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): లోక్‌సభ ఎన్నికల సమరం వేడెక్కుతున్న తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజుకో తీరుగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వర్గపోరుతో సతమతమవుతుంటే, కాంగ్రె్‌సలోనూ భిన్నపరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన పార్టీల్లో లోక్‌సభ ఎన్నికల ముంగి ట ఏర్పడ్డ వాతావరణం నాయకుల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే ఆ ప్రభావం పోలింగ్‌ సరళిపై కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్ఠానాలకు తలనొప్పిగా మారుతున్న ఇక్కడి వ్యవహారాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

బీఆర్‌ఎ్‌సలో కీలక నేతల నడుమ అసెంబ్లీ ఎన్నికల నుంచి నెలకొన్న విభేదాలు తాజాగా ఒక్కోటి బహిర్గతమవుతున్నాయి. ప్రధానంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయులకు, మాజీ ప్రజాప్రతినిధుల వర్గీయుల నడుమ ఉన్న వర్గభేదాలు ఆ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. సుఖేందర్‌రెడ్డి స్వయంగా పలుమార్లు ఏదో ఒక వేదికగా బీఆర్‌ఎ్‌సలో అసమ్మతిపై, పార్టీ విధానాల్లోని లోపాలపై సూటిగా విమర్శలు సంధించారు. ఆయన తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి తొలుత జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లలో ఒకదానికి పోటీకి సిద్ధమని ప్రకటించి, ఆతర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగాక ప్రచారానికి సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన బస్సుయాత్రకు కూడా అమిత్‌ దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రె్‌సలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా, గుత్తాపై మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ అనుచిత ఆరోపణలు చేశారని ఆయనపై గుత్తా వర్గీయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు నేతృత్వంలో సుఖేందర్‌రెడ్డి వర్గీయులు సుఖేందర్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కిషోర్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. ఇది బీఆర్‌ఎ్‌సలోనేగాక ఇతర పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. పార్టీ క్యాడర్‌ ఏకతాటిపై నిలబడి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సను ఢీకొట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచిస్తుంటే, తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని క్యాడర్‌లో చర్చసాగుతోంది.

కాంగ్రె్‌సలోనూ ఆసక్తికర పరిణామాలు

ఉమ్మడి జిల్లా కాంగ్రె్‌సలోనూ భిన్న పరిణామాలు నెలకొంటున్నాయి. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నత స్థాయి నేతలు పిలుపునిస్తుంటే, నియోజకవర్గాల్లో కొంత విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జిల్లాలో బీఆర్‌ఎ్‌సలోని పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరుతుంటే మెజార్టీ నియోజకవర్గాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు పార్టీ పాత క్యాడర్‌కు నచ్చజెబుతూ చేరికలను స్వాగతిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా ఈ చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మునిసిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఈ చేరికలు కాంగ్రె్‌సకు పలుచోట్ల ఉపయోగపడ్డాయి. వేర్వేరు సందర్భాల్లో బీఆర్‌ఎ్‌సలో చేరిన పలువురు సీనియర్‌, జూనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునుగోడు నియోజకవర్గానికి చెందిన చల్లమల కృష్ణారెడ్డి కాంగ్రె్‌సలో చేరితే, ఆయన చేరికను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దాన్ని పార్టీ నిలిపివేసింది. తాజాగా, మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి రిపీట్‌ అయింది. ఇక్కడ సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువు రు కీలకనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎ్‌సలోకి జంప్‌ చేశారు. ఎన్నికలవరకు చేరికలను స్వాగతించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చేరుతున్న వారిని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, కష్టకాలంలో అండగా ఉన్న తమను కనీసం సంప్రదించకుండా, తమకు సంబంధం లేకుండా చేర్చుకుంటే ససేమిరా అనడంతో పార్టీ అధిష్ఠానం సైతం ఒక్కడుగు వెనక్కివేసింది. తాజాగా, మునిసిపల్‌ చైౖర్మన్‌ తిరునగరు భార్గవ్‌, మరో 13 మంది కౌన్సిలర్లు పీసీసీ ఇన్‌చార్జి దీపాదా్‌సమున్షి సమక్షంలో పార్టీలో చేరినా, స్థానిక ఎమ్మె ల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు అధిష్ఠానానికి తమ అసమ్మతిని తెలియజేయడంతో ఆ చేరికను నిలిపివేస్తూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ ప్రకటన జారీ చేశారు. ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డితో కలిసి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ మిర్యాలగూడలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్ల చేరికను అధిష్ఠానం నిలిపివేసిందని, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, పార్టీ క్యాడర్‌ అభిప్రాయాలు తీసుకున్నాకే చేరికలపై ఇకముందు పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వాడివేడిగా ఈ పరిణామాలు జరుగుతుండడంపై కాంగ్రె్‌సతో పాటు, ఇతర రాజకీయవర్గాల్లోనూ ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Updated Date - Apr 28 , 2024 | 12:02 AM