Share News

తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:09 AM

మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్‌ (37)అనే తాపీమేస్త్రీ, అతని చిన్న కుమారుడు బోడ సాయి(11) ఇరువురు మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మృతిచెందిన విషాదకరసంఘటన విదితమే.

 తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు

ఆత్మకూరు(ఎం) ఏప్రిల్‌ 27: మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్‌ (37)అనే తాపీమేస్త్రీ, అతని చిన్న కుమారుడు బోడ సాయి(11) ఇరువురు మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మృతిచెందిన విషాదకరసంఘటన విదితమే. తండ్రీకుమారుల మృతదేహాలను శనివారం స్వగ్రామం రాయిపల్లికి తీసుకొచ్చారు. ఇద్దరి మృతదేహాలను చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. నరేష్‌ తన భార్య ఉష, ఇద్దరు కొడుకులతో ఆత్మకూరు మండల కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో ఉంటూ మేస్త్రీ పని నేర్చుకున్నాడు. ఇటీవల సొంత ఊరిలో ఇల్లు కట్టుకొని అక్కడికి మారాడు. నరేష్‌ దంపతులు ఇద్దరు ప్రతీ రోజు తాపీ పనికి వెళ్లేవారు. కుమారులు చందు, సాయి ఇద్దరు ఆత్మకూరు హైస్కూల్లో చదువుకుంటున్నారు. రాయిపల్లిలో చనిపోయిన తండ్రీకుమారుల కుటుంబాన్ని ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నరేష్‌ భార్య ఉష, పెద్ద కుమారుడు చందుకు అధైర్యపడొద్దు, అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 12:09 AM