Share News

నిబంధనల మేరకు నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:27 AM

నామినేషన్ల పరిశీలన నిబంధనల మేరకు పక్కాగా జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ కలెక్టర్లను ఆదేశించారు.

నిబంధనల మేరకు నామినేషన్ల పరిశీలన

ఈసీ వికా్‌సరాజ్‌

భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 24: నామినేషన్ల పరిశీలన నిబంధనల మేరకు పక్కాగా జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉన్నతాధికారులతో కలి సి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేషన్ల ఉపసంహరణ, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ, హోం ఓటింగ్‌, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతీ ఓటరుకు ఓటరు సమాచారం స్లిప్పులు పంపిణీకోసం నిర్దేశిత షెడ్యూల్‌ రూపొందించి బూత్‌స్థాయి అధికారుల ద్వారా ప్రతీఓటర్‌కు స్లిప్పులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేం ద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, ఆశా, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బందితో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేం ద్రం ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వెబ్‌క్యాస్టింగ్‌ చేస్తున్న పోలింగ్‌ కేంద్రాల వివరాలు సమర్పించాలన్నారు. ఫాం. 12-డీ కింద ఇంటి వద్దే ఓటు వినియోగించుకునేందుకు దరఖాస్తులు చే సుకున్న దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల ఓట్ల స్వీకరణకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ రోజు ప్రతీ రెండు గంటలకు పోలింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, పోలింగ్‌ ప్రక్రియలో ఈవీఎం యంత్రాలు ఇబ్బందులుకు గురైతే వెంటనే రిజర్వు ఈవీఎం యంత్రాలను సెక్టార్‌ అధికారులు మార్చేవిధంగా సిద్ధంగా ఉం డాలన్నారు.సమీక్షలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే,అదనపు కలెక్టర్లు పి.బెన్‌షాలోమ్‌, కే.గంగాధర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవో పి.అమరేందర్‌, శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో శోభరాణి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఎం.నాగేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:27 AM