Share News

కల్తీ చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:13 AM

పెట్రోల్‌ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.

కల్తీ చేస్తే కఠిన చర్యలు
పెట్రోల్‌ బంక్‌ను తనిఖీ చేస్తున్న తూనికలు, కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు

మోత్కూరు, ఏప్రిల్‌ 24: పెట్రోల్‌ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని హెచపీ పెట్రోల్‌ బంక్‌ను బుధవారం తూనికలు, కొలతల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఐదు లీటర్ల పెట్రోల్‌ కొట్టించి చూడగా 5ఎంఎల్‌ నుంచి 10ఎంఎల్‌ పెట్రోల్‌ తక్కువ వచ్చిందన్నారు. ఆ నాజిల్‌ వాడవద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరికరాలు ఏవైనా సరే తూనికలు, కొలతల శాఖ నుంచి సర్టిఫై చేయించుకున్న తర్వాతే వినియోగించాలన్నారు. గుండాలలో రెండు వేబ్రిడ్జిలను గత నెల 22న తనిఖీ చేయగా తూనికలు, కొలతల శాఖ సర్టిఫికేట్‌ లేకుండానే వాడుతున్నారన్నారు. వెంటనే అధికారులతో సర్టిఫై చేయించుకోవాలని చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా నేటికీ అలానే వినియోగిస్తున్నారన్నారు. బుధవారం మరోసారి ఆ వేబ్రిడ్జిలను తనిఖీ చేసి వాటిపై కేసులు చేసి, తూకాలు నిలిపిచేయించానన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:16 AM