Share News

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:38 AM

కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌సింగ్‌ చౌహాన అన్నారు.

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
ఆలేరు మార్కెట్‌లో కాంటాను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ చౌహాన

పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన

ఆలేరు రూరల్‌, ఏప్రిల్‌ 24: కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌సింగ్‌ చౌహాన అన్నారు. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం కొనుగోలుచేస్తున్న కేంద్రాల వద్దకు తెచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రపరిచి, ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తెస్తే వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు చెల్లించాల్సిన బిల్లులను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఆలేరులో మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. అకాల వర్షాలకు భయపడి రైతులు తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివా్‌సరెడ్డి, డీటీవో అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:38 AM