Share News

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:54 AM

మండల పరిధిలోని గౌరారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల వేడుకల్లో భాగంగా దేవాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు హోమం, ప్రత్యేక పూజలు చేపట్టారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

ఆమనగల్లు, ఏప్రిల్‌ 24 : మండల పరిధిలోని గౌరారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల వేడుకల్లో భాగంగా దేవాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు హోమం, ప్రత్యేక పూజలు చేపట్టారు. గౌరారంతో పాటు ఆమనగల్లు, మాడ్గుల మండలాల నుంచి భక్తులు విగ్రహ ప్రతిష్ఠాపనకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తులకు ఎంపీటీసీ నిట్టమంగమ్మ నారాయణ, మాజీసర్పంచ్‌ శ్రీపాతిరజిత శ్రీనివా్‌సరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు దోనాదుల వెంకట్రాములు, కార్యదర్శి చిట్టిగోరి బాస్కర్‌రావు భక్తులకు ఏర్పాట్లు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులు, నాయకులు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నిట్ట నారాయణ, నాయకులు ఆంజనేయులురావు, శంకరయ్య, శ్రీపాతి సాయిరెడ్డి, నల్లబోలు అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రాద్‌, లక్ష్మణ్‌రావు, శ్రీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

యాచారం : మండలంలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు స్వామి వారి రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు. అంతకు ముందు స్వామి వారి విగ్రహాలను రథంపై ఊరేగించేందుకు వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరిపారు. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. రథోత్సవానికి ముందు స్వామి వారి హుండీ ఆదాయం రూ.6లక్షలు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ శంక్‌కుమార్‌ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:58 AM