Share News

కాంగ్రెస్‌ను గెలిపించాలి : రంజిత్‌రెడ్డి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:01 AM

సంక్షే మ పథకాల అమలుకు కాంగ్రె్‌సను గెలిపించాలని.. ఐదేళ్లుగా చేవెళ్ల ప్రజలకు సేవలు అందించానని.. మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని రంజిత్‌రెడ్డి ఓటర్లను కోరారు.

కాంగ్రెస్‌ను గెలిపించాలి : రంజిత్‌రెడ్డి
కందుకూరు : నేదునూరులో మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి, పక్కన తీగల కృష్ణారెడ్డి

జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం

కందుకూరు, ఏప్రిల్‌ 27 : సంక్షే మ పథకాల అమలుకు కాంగ్రె్‌సను గెలిపించాలని.. ఐదేళ్లుగా చేవెళ్ల ప్రజలకు సేవలు అందించానని.. మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని రంజిత్‌రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం మండలంలోని సరస్వతిగూడ, లేమూరు, తిమ్మాపురం, రాచులూరు, గూడూరు, పులిమామిడి, నేదునూరులో మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు రంజిత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాకుండానే ప్రతిపక్షాల నేతలు కాంగ్రె్‌సను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.15వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏటా 3,700 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఐదేళ్ల కాలంలో 18,500 ఇళ్లను నిర్మించడానికి రేవంత్‌రెడ్డి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆగష్టు 15 లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందడానికి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు చేవెళ్ల పార్లమెంట్‌ ప్రజల సమస్యలు క్షుణ్ణంగా తెలుసని, ఎంపీగా మరోసారి అవకాశమిస్తే సమస్యలను పూర్తిస్థాయిలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దెబ్బడగూడ గ్రామానికి చెందిన ఎల్మటి శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి, సరికొండ మల్లేష్‌, కృష్ణనాయక్‌, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైఎస్‌ ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షులు నర్సింహచారి, నాయకులు ఈశ్వర్‌గౌడ్‌, సన్నీళ్ల నర్సింహ, ఎండీ అఫ్జల్‌బేగ్‌, తదితరులు పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డిని గెలిపించాలి : స్పీకర్‌

వికారాబాద్‌ : పేదల కోసం పనిచేసే నాయకుడు రంజిత్‌రెడ్డి అని, ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలోని క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా సమావేశం నిర్వహించారు. ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ఏ ఒక్క హామీ నెరవర్చలేదన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారన్నారు. రాహుల్‌ ప్రధాని కావాలంటే తెలంగాణలో 14 స్థానాలు గెలుచుకోవాలన్నారు. ఎస్సీసెల్‌ స్టేట్‌ చైర్మన్‌ ప్రీతమ్‌బాబు, బంట్వారం జడ్పీటీసీ సంతోషరాజు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

యాలాల/తాండూరు/పరిగి/పూడూరు/చేవెళ్ల : బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. యాలాల మండలం కోకట్‌, పగిడ్యాల్‌, ముద్దాయిపేట్‌, దేవనూరు, యాలాల, జుంటుపల్లి, తిమ్మాయిపల్లి, చెన్నారంలో ప్రచారం నిర్వహించారు. యాలాల పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, నాయకులున్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్‌ పరిధిలో రంజిత్‌రెడ్డికి మద్దతుగా మహిళ కాంగ్రెస్‌ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీతారెడ్డి, ఎమ్మెల్యే సతీమణి అరుణ, సుజాత, సునిత సంపత్‌, శోభారాణి, స్వప్న పరిమళ్‌, కౌన్సిలరున్నారు. రంజిత్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని పీసీసీ సభ్యుడు రిత్విక్‌రెడ్డి కోరారు. పరిగి మండలం రాపోల్‌లో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండలాధ్యక్షుడు బి.పరుశరాంరెడ్డి, తదితరులున్నారు. పూడూరు మండలం సోమన్‌గుర్తిలో రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ రాకంచర్ల మాజీ సర్పంచ్‌ పెంటయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఎంపీటీసీ దేవికాశివారెడ్డి, రఘురాంరెడ్డి, భాస్కర్‌, తదితరులున్నారు. చేవెళ్లలో రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి కోరారు. చేవెళ్ల మండలం చనువల్లి, ఇక్కారెడ్డిగూడలో నాయకులతో కలిసి ప్రచారం చేశారు. డీసీసీ కార్యదర్శి పెంటయ్యగౌడ్‌, మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా తయారు చేయాలి

మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రె్‌సను తిరుగులేని శక్తిగా తయారు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేఎల్లార్‌ అన్నారు. గట్టుపల్లికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తుక్కుగూడలోని పార్టీ కార్యాలయంలో కేఎల్లార్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. వారు మాట్లాడుతూ రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీపీ రఘుమారెడ్డి, రాకే్‌షరెడ్డి, నాయకులున్నారు.

ఆల్విన్‌ కాలనీ, ఆర్కేపురం, హైదర్‌నగర్‌లో ప్రచారం

మియాపూర్‌/ఎల్‌బీనగర్‌/హైదర్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): హఫీజ్‌పేట డివిజన్‌ ఆల్విన్‌కాలనీలో కార్పొరేటర్‌ పూజిత నాయకులు, కార్యకర్తలతో కలిసి రంజిత్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అదేవిధంగా రంజిత్‌రెడ్డి గెలుపునకు కాంగ్రెస్‌ శ్రేణులు మరింత కృషి చేయాలని పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధి ఆర్కేపురం డివిజన్‌ ఎన్టీఆర్‌ నగర్‌ ఫేస్‌-1, 2లో రంజిత్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. రంజిత్‌రెడ్డి తనయుడు ఆర్యన్‌రెడ్డితో కలిసి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఆల్విన్‌కాలనీ డివిజన్‌ పీజేఆర్‌నగర్‌లో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటే్‌షగౌడ్‌ ఇంటింటి ప్రచారం చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 12:01 AM