Share News

జిల్లా ఓటర్లు 36,23,960

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:03 AM

కేంద్ర ఎన్నికల సంఘం అనుబంధ ఓటరు జాబితాను విడుదల చేసింది. అనుబంధ జాబితా ప్రకారం తాజాగా జిల్లాలో 36,23,960 మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లా ఓటర్లు 36,23,960

ఓటరు అనుబంధ జాబితా విడుదల

శేరిలింగంపల్లిలో 7,58,102 మంది ఓటర్లు

కొత్తగా చేరిన ఓటర్లు 78,274 మంది

పేర్లు తొలగించిన ఓటర్ల సంఖ్య 45,434

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 27 : కేంద్ర ఎన్నికల సంఘం అనుబంధ ఓటరు జాబితాను విడుదల చేసింది. అనుబంధ జాబితా ప్రకారం తాజాగా జిల్లాలో 36,23,960 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు అందిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు పరిష్కరించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఓటరు తుది జాబితాకు అనుబంధ జాబితాను రూపొందించారు. ఫిబ్రవరిలో విడదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 35,91,120 ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,58,102 ఓటర్లు ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 302, సర్వీసు ఓటర్లు 56, పీడబ్ల్యూ ఓటర్లు 45,745 ఉన్నారు. ఇదిలా ఉండగా మృతిచెందిన వారు, వలస వెళ్లిన ఓటర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. జిల్లాలో మొత్తం 45,434 ఓటర్లును తొలగించారు. అందులో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 16,604 మంది ఓటర్ల పేర్లను తొలగించారు.

కొత్త ఓటర్లు 78,274

18 ఏళ్లు నిండి యువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొం దేందుకు ఉత్సాహం చూపారు. లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన యువత ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం లాస్ట్‌ చాన్స్‌గా ఈ నెల 15 వరకు అవకాశం కల్పించడంతో యువకులు పెద్ద సంఖ్యలో ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్లలో దరఖాస్తు చేసు కున్నారు. అనుబంధ జాబితాలో 78,274 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 27,033 మంది, అత్యల్పంగా షాద్‌నగర్‌లో 2,165 మంది కొత్తగా నమోదయ్యారు.

Updated Date - Apr 28 , 2024 | 12:03 AM