Share News

ఎండల దృష్ట్యా ఉదయం 11గంటలకే పనులు ముగించాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 AM

వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6గంటలకే కూలీలు పనిప్రారంభించి ఉదయం 11గంటలకల్లా పనిముగించుకుని ఇ ళ్లకు వెళ్లాలని పంచాయతీరాజ్‌ డిప్యుటీ కమిషనర్‌ రవీందర్‌ సూచించారు.

ఎండల దృష్ట్యా  ఉదయం 11గంటలకే పనులు ముగించాలి
ముకునూరులో ఉపాధి పనులను పరిశీలిస్తున్న డీసీ రవీందర్‌, తదితరులు

ఇబ్రహీంపట్నం/మంచాల, ఏప్రిల్‌ 27 : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6గంటలకే కూలీలు పనిప్రారంభించి ఉదయం 11గంటలకల్లా పనిముగించుకుని ఇ ళ్లకు వెళ్లాలని పంచాయతీరాజ్‌ డిప్యుటీ కమిషనర్‌ రవీందర్‌ సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం ముకునూరులో డీఆర్‌డీవో శ్రీలత, అదనపు డీఆర్‌డీవో సుభాషిణితో కలిసి ఉపాధి పనులను పరిశీలించారు. కుంటకట్ట పనులను చూశారు. నర్సరీలో అన్ని రకాల మొక్కలను పెంచాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా నాటే ందుకు రావి, వేప, కానుగ, గుల్‌మోర్‌, సిసులాంటి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు అందుబాటులో ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కూలీలకు సౌకర్యాలు కల్పించకుంటే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. వీరి వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ సక్రియానాయ క్‌, ఏపీవో తిరుపతిచారి, ఈసీ రవికుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఇందిర ఉన్నారు. అం తకు ముందు డిప్యుటీ కమిషనర్‌ మంచాల మండలం తాళ్లపల్లిగూడలో పనులను పరిశీలించారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత కొలతల మేరకు కూలీలు పనులు చేయాలని రవీందర్‌ తెలిపారు. అలా పనిచేస్తే కూలీలకు రూ.300 దినసరి వేతనం అందుతుందని తెలిపారు. ఆయన వెంట ఏంపీడీవో శంకర్‌, డీఎల్‌పీవో సాధన, ఏపీడీ సక్రియా, ఏపీవో వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:08 AM