Share News

ఎంసీఎంసీ కేంద్రం, కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:58 PM

చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికలను సందర్భంగా కలెక్టరేట్‌లోని మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, పోలీస్‌ పరిశీలకులు కాలురామ్‌ రావత్‌, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రాలు శనివారం పరిశీలించారు.

ఎంసీఎంసీ కేంద్రం, కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన
ఎంసీఎంసీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పరిశీలకులు

వివరాలు అడిగి తెలుసుకున్న ఎన్నికల, పోలీస్‌, వ్యయ పరిశీలకులు

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 27 : చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికలను సందర్భంగా కలెక్టరేట్‌లోని మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌ను ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, పోలీస్‌ పరిశీలకులు కాలురామ్‌ రావత్‌, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రాలు శనివారం పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఐడీవోసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. 1950 టోల్‌ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరును గమనించారు. చెక్‌పో్‌స్టల వద్ద ఎస్‌ఎ్‌సటీ బృందాల పని తీరు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరును పరిశీలించారు. కంట్రోల్‌ రూమ్‌లో జీపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని గమనించారు. అబ్జర్వర్ల వెంట కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ స్నేహ, ఇతర అధికారులున్నారు.

ఫిర్యాదులు, సూచనలకు అందుబాటులో ఎన్నికల పరిశీలకులు : కలెక్టర్‌ శశాంక

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక సూచించారు. సాధారణ పరిశీలకులుగా రాజేందర్‌ కుమార్‌ కటారియా(ఐఎఎస్‌) వ్యవహరిస్తున్నారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయాలనుకునేవారు జనరల్‌ అబ్జర్వర్‌ సెల్‌ నెంబర్‌ 7032666271లో సంప్రదించవచ్చని సూచించారు. అదేవిధంగా పోలీసు పరిశీలకులుగా కాలురామ్‌ రావత్‌, ఐసీఎస్‌ వ్యవహరిస్తున్నారని, సెల్‌నెంబర్‌ 7032666272 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వ్యయ పరిశీలకులుగా, రాజీవ్‌చావ్రా, ఐఆర్‌ఎస్‌, పి.సెంథిల్‌ కుమార్‌, ఐఆర్‌ఎస్‌, వ్యవహరిస్తున్నారని, రాజీవ్‌చావ్రా సెల్‌నెంబర్‌ 7032666274 పి.సెంథిల్‌ కుమార్‌ నెంబర్‌ 7032666273 ద్వారా వ్యయ అబ్జర్వర్లను సంప్రదించవవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అబ్జర్వర్లు నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలిస్తారని, సెలవు దినాల్లో మినహాయించి మిగితా అన్నిరోజుల్లో నిర్ణీత సమయాల్లో పరిశీలకులను సంప్రదించవచ్చని తెలిపారు.

ఎన్నికల పరిశీలకులకు స్వాగతం పలికిన కలెక్టర్‌

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా ఐఎఎస్‌ పోలీస్‌ పరిశీలకులు కాలు రామ్‌ రావత్‌, ఐపిఎస్‌, వ్యయ పరిశీలకులు, రాజీవ్‌ చావ్రా, ఐఆర్‌ఎ్‌సలకు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పూలబొకేలు అందించి ఘనస్వాగతం పలికారు.

Updated Date - Apr 27 , 2024 | 11:58 PM