Share News

రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:11 AM

సాధారణ, పోలీస్‌ పరిశీలకుల సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ప్రక్రియను చేవెళ్ల పార్లమెంటరీ రిటర్నింగ్‌ అధికారి, శశాంక, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నిర్వహించారు.

రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి శశాంక

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 27 : సాధారణ, పోలీస్‌ పరిశీలకుల సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ప్రక్రియను చేవెళ్ల పార్లమెంటరీ రిటర్నింగ్‌ అధికారి, శశాంక, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నిర్వహించారు. చేవేళ్ల పార్లమెంటు నియోజక వర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం రంగారెడ్డి, వికారాబా ద్‌ జిల్లాల పోలింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, రాజేందర్‌ కుమార్‌ కటారియా, పోలీసు పరిశీలకులు కాలురామ్‌ రావత్‌ల సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్లు శశాంక, సి.నారాయణరెడ్డితో కలి సి రంగారెడ్డి జిల్లా కలెకరేట్‌లో ర్యాండమైజేషన్‌ప్రక్రియ నిర్వహించగా జనరల్‌ అబ్జర్వర్‌ ర్యాండమైజేషన్‌ను నిశితంగా పరిశీలించారు. పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడిం గ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను, వోపీఓలను ర్యాండమైజేషన్‌ద్వారా కేటాయించారు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3,306 పోలింగ్‌ కేంద్రాలుండగా, విధులకు 15,224మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో పోలింగ్‌నిర్వహణకు ప్రత్యేకంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల చొప్పున మహిళా బృందాలను, ఒకటి చొప్పున దివ్యా ంగుల బృందం, యువతతో కూడిన పోలింగ్‌ బృందాలను ఎంపిక చేశామని వివరించారు. పోలింగ్‌ సిబ్బందికి ఇప్పటికే ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్‌ ట్రైనర్స్‌చే పోలింగ్‌ నిర్వహణపై మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

రెండో విడత శిక్షణకు ఏర్పాట్లు

మే 1, 2వతేదీల్లో రెండో విడత శిక్షణకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు పరిశీలకులకు వివరించారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ సిబ్బంది ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్‌ప్రక్రియను కూడా పూర్తిచేశారు. ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమాహారతి, డీఆర్వో సంగీత, ఎన్‌ఐసీ అధికారి స్వర్ణలత, ఆర్డీవోలు, సూరజ్‌కుమార్‌, అనంతరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:11 AM