Share News

యువత మద్దతు మోదీకే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:57 PM

దేశంలోని కోట్లాది యువతీ యువకులంతా నరేంద్రమోదీకి మద్దతుగా నిలిచారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

యువత మద్దతు మోదీకే..
శంషాబాద్‌ : మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి

శంషాబాద్‌, ఏప్రిల్‌ 27 : దేశంలోని కోట్లాది యువతీ యువకులంతా నరేంద్రమోదీకి మద్దతుగా నిలిచారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని వైఎన్‌ఆర్‌ గార్డెన్‌లో శనివారం బీజేపీ యువమోర్చా సమ్మేళనం జరిగింది. విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మోదీ సర్కార్‌ ఎందరో యువతీ యువకులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు, ముద్రా లోన్ల ద్వారా స్వయం ఉపాధిశక్తిని పెంపొందించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును అబాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, ఎదుర్కొనేందుకు మోదీవెంట యువత నిలబడాలన్నారు. కాంగ్రెస్‌ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరని సమానంగా చూసిందని అన్నారు.

మైనార్టీలను ఆదుకున్నది బీజేపీనే

దేశంలో ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత కేవలం బీజేపీకే దక్కుతుందని కొండా అన్నారు. పీఎం ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా 31 శాతం, ముద్రా లోన్ల ద్వారా 37 శాతం మంది ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. నరేంద్రమోదీకి పోటీగా నిలబడలేకనే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ పిలుపు ఇచ్చినట్లుగా బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుందని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందన్నారు. రంజిత్‌రెడ్డి తనవెంట 4 లక్షల మంది ముస్లిం మైనార్టీల ఓటర్లున్నారని సంబరపడిపోతున్నారని, వారికి ఇక్కడున్న యువకులే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌, ప్రధాన కార్యదర్శి గణేశ్‌, కార్యవర్గ సభ్యులు ప్రేంరాజ్‌, జంగయ్య, కంటెస్టెడ్‌ ఎమ్యెల్యే తోకల శ్రీనివా్‌సరెడ్డి, ముఖ్యనాయకులున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి తప్పక విజయం సాధిస్తాడని నాయకులు డాక్టర్‌ ప్రేంరాజ్‌, ఎన్‌.శంకరప్ప, దేవేందర్‌లు ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని ప్రచార కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంజిత్‌రెడ్డి మాటలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. జ్ఞానేశ్వర్‌ ఎంత ప్రచారం చేసినా విజయం సాధించలేరని చెప్పారు.

మోదీ గాలి తెలంగాణలో కూడా వీస్తోంది

మాదాపూర్‌ (ఆంధ్రజ్యోతి): దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ వేవ్‌(గాలి) కనిపిస్తుందని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్‌, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ముస్లింల ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఎంఐఎం పార్టీ కన్నా కాంగ్రె్‌సకే ముస్లిం వర్గాల ఓట్లు అధికంగా పోలవుతాయని, కాంగ్రెస్‌ పార్టీ పచ్చి మతతత్వ పార్టీ అని విమర్శించారు. మియాపూర్‌ ప్రాంతంలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌, మయూరి నగర్‌పార్క్‌, వేర్టెక్స్‌ ప్రైడ్‌, హైదర్‌నగర్‌ పరిధిలోని వశిష్ట అపార్ట్‌మెంట్‌, కావ్య గ్రీన్‌ అపార్ట్‌మెంట్‌, వెర్టెక్స్‌ ప్రెసెంట్‌, వేర్‌టెక్స్‌ కళ్యాణ్‌ రెసిడెన్సీ, ఎస్సార్‌ రెసిడెన్సీ, జలవాయువిహార్‌ కమ్యూనిటీహాల్‌ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.

చేవెళ్లలో బీజేపీదే విజయం

వికారాబాద్‌ : చేవెళ్లలో బీజేపీ గెలుపు ఖాయమని విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు విశ్వజిత్‌రెడ్డి అన్నారు. సిద్దులూరు, కోటాలగూడం, పీరంపల్లి, పులుసుమామిడి, పాతూరు, రామారెడ్డిగూడ, బురాన్‌పల్లి, తండా, గొట్టిముక్కుల, ద్యాచారం, ఐనాపూర్‌, జైదుపల్లి, గోధుమగూడలో ప్రచారం చేశారు. పెండ్లిమడుగు మాజీ సర్పంచ్‌ బుచ్చిరెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నందు, నాయకుడు గోపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి మునిసిపాలిటీలోని ఆలంపల్లి రాఘవేంద్రకాలనీలో పట్టణాధ్యక్షుడు నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.

కొండా గెలుపునకు కృషి చేయాలి

మొయినాబాద్‌ రూరల్‌/మోమిన్‌పేట్‌ : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లోని కంజర్ల మాల్‌లో నియోజకవర్గ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కన్వీనర్‌ వెంకటే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆచారి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బీసీల ఆర్థికాభివృద్ధికి 33 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 శాతం తగ్గించిందన్నారు. అనంతరం ఆమ్డాపూర్‌లో పర్యటించిన విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్‌, ఈశ్వరప్ప, కంజర్ల ప్రకాష్‌, రత్నం, నాయకులున్నారు. మోమిన్‌పేట్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి కొల్కుందలో ప్రచారం చేశారు. మల్లేశ్‌యాదవ్‌, తదితరులున్నారు.

చేవెళ్ల గడ్డ.. బీజేపీ అడ్డా : ఎంపీపీ

యాలాల/చేవెళ్ల/పూడూరు/కందుకూరు : చేవెళ్ల గడ్డ.. బీజేపీ అడ్డా అని ఎంపీపీ బాలేశ్వర్‌ గుప్తా అన్నారు. యాలాల మండల శాఖ ఆధ్వర్యంలో అన్నాసాగర్‌, బానాపూర్‌, అడాల్‌పూర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలాధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి మధు, రమ్యానాయక్‌, రఘు, కార్యకర్తలున్నారు. అలాగే జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మండలాధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి చేవెళ్ల మండలం న్యాలట, సింగప్పగూడలో ప్రచారం చేశారు. పూడూరు మండలం చీలాపూర్‌లో నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యుడు మల్లేష్‌ పటేల్‌, మండలాధ్యక్షుడు రాఘవేందర్‌, చీలాపూర్‌ బూత్‌ అధ్యక్షుడు రవీందర్‌ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. విశ్వేశ్వర్‌రెడ్డి విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఇరవై రోజులు శ్రమిస్తే.. వందేళ్ల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి అన్నారు. మండల శాఖ అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ అధ్యక్షతన కందుకూరులో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నాయకులు సుఽధాకర్‌శర్మ, కె.జంగయ్యయాదవ్‌, తదితరులున్నారు. కాగా, పార్టీ నాయకులు తనను చిన్నచూపు చూస్తున్నారని ఎంపీపీ మంద జ్యోతి అన్నారు. సమావేశంలో బ్యానర్‌పై తన ఫొటోను వాడలేదని సభా వేదికపైకి ఎక్కకుండా అలిగి వెళ్లిపోయారు.

Updated Date - Apr 27 , 2024 | 11:57 PM