Share News

దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:23 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నారు.. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద, యాదాద్రి పోయి లక్ష్మీనర్సింహస్వామి మీద, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. పైగా దేవుళ్ల

దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే

పైగా బీజేపీపై విమర్శలు చేయడమా?.. ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు?

ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం: బండి సంజయ్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నారు.. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద, యాదాద్రి పోయి లక్ష్మీనర్సింహస్వామి మీద, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. పైగా దేవుళ్ల పేరిట రాజకీయం చేస్తున్నారని బీజేపీపైనే విమర్శలు చేస్తున్నారు. దేవుళ్ల మీద వాళ్లు మాట్లాడితే ఒప్పు.. నేను మాట్లాడితే తప్పవుతుందా..?్‌్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో ఆయన పర్యటించారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ యువజన అధ్యక్షుడు, ముదిరాజ్‌ సంఘం నేత మంద శ్రీరాం ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో కూడా నేటికీ తేల్చుకోలేని నాయకులు తనను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశా రు. ఇక్కడున్నాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్‌ను తీసుకుపోయి నామినేషన్‌ వేయిస్తే కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌ అయిందన్నారు. నామినేషన్‌ దాఖలుకు ఒక్కరోజే గడువు ఉన్నా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో కూడా అధికారికంగా తేల్చుకోలేకపోతున్న నేతలు తనపై విమర్శలు చేయ డం హాస్యాస్పదమన్నారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అయిపోగానే జూన్‌ 4న రుణమాఫీ ఎందుకు చేయరని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించి ఓట్లు దండుకుని, రుణమాఫీ సహా ఆ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ వేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కొట్లాడేది తమ పార్టీ మాత్రమేనన్నారు. తాలు, తరుగు, తేమ తో పని లేకుండా వడ్లను కొనాలంటే రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని, వడ్లకు బోనస్‌ కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేయలేనోళ్లు రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. హామీల అమలు కోసం కొట్లాడతామని, కాంగ్రెస్‌ మెడలు వంచేదాకా పోరాడుతామని చెప్పారు. గతంలో కేసీఆర్‌ సర్కార్‌ మోసాలను ఎండగట్టానని, ఫాంహౌజ్‌లో పడుకున్నోడిని ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చినాననే అక్కసుతో తన ను ఎంపీగా ఓడగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదని తాను కాంగ్రె్‌సను నిలదీస్తున్నాన్న అక్కసుతో.. తనను ఓడించాలని బీఆర్‌ఎ్‌సతో ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు కుమ్మక్కయ్యారని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్‌ నిధులు మళ్లించారు!

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ నిధులిస్తే.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ నిధులను ఇతర పథకాలను మళ్లించారని సంజయ్‌ ఆరోపించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉచితంగా కేంద్రం బియ్యం ఇవ్వగా.. తానే ఇచ్చినట్లుగా కేసీఆర్‌ రేషన్‌ దుకాణాల్లో తన బొమ్మలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదేళ్లుగా ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని విమర్శిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఆనాడు కేసీఆర్‌పై ఎందుకు కొట్లాడలేదని ప్రశ్నించారు. మోదీ బాత్రూంలు కడితే ఓట్లేస్తరా? అని చులకనగా మాట్లాడుతున్నారని, దేశాన్ని 57 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ బాత్రూంలు ఎందుకు కట్టివ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాగా, గురువారం ఉదయం 11.30 గంటలకు కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్‌ భాయ్‌ పటేల్‌, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హాజరుకానున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:23 AM