Share News

Congress: ములుగు జిల్లా: ఉపాధి హామీ కూలీలతో మమేకమైన సీతక్క

ABN , Publish Date - Apr 24 , 2024 | 09:04 AM

ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్‌, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Congress: ములుగు జిల్లా: ఉపాధి హామీ కూలీలతో మమేకమైన సీతక్క
Congress, Sitakka

ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారం (Election Campaign) ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్‌, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క (Minister Sitakka) ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మంత్రి మమేకమయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమల్లోకి తెచ్చింది సోనియాగాంధీయేనని, పేదల ఆకలి తీర్చేందుకు సోనియా ఈపథకాన్ని తెచ్చారని చెప్పారు. వంద రోజుల పనిని 42 రోజులకు తగ్గించారని, కూలీ కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి కూలీలకు వందరోజుల పనితో పాటు 400 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పుడితే పన్ను... చస్తే పన్ను వేస్తున్నారని మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఎన్నికలు ముగియగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రమాణికమనీ, అలాంటి వాటికి తిలోదకాలిచ్చిన మోదీ ప్రభుత్వం, దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిద్దిపేటలో రేపు అమిత్ షా బహిరంగ సభ

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 09:12 AM