Share News

Hero Venu: హీరో వేణుపై కేసు నమోదు.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Feb 06 , 2025 | 06:52 AM

ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణు(Hero Thottempudi Venu)పై జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశించింది.

Hero Venu: హీరో వేణుపై కేసు నమోదు.. విషయం ఏంటంటే..

హైదరాబాద్‌: ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణు(Hero Thottempudi Venu)పై జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశించింది. వేణు బోర్డు సభ్యుడిగా ఉన్న ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ గతంలో ఉత్తరాఖండ్‌లోని ఒక జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని తెహ్రీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) నుంచి దక్కించుకుంది. ఈ వర్క్‌లో కొంత భాగాన్ని బంజార్‌హిల్స్‌లోని రిత్విక్‌ ప్రాజెక్ట్సుకు సబ్‌ కాంట్రాక్టుగా ప్రోగ్రెసివ్‌ సంస్థ కేటాయించింది.

ఈ వార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..


అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సబ్‌ కాంట్రాక్టును రద్దు చేశారనే అభియోగంతో రిత్విక్‌ సంస్థ ఎండీ రవికృష్ణ ప్రోగ్రెసివ్‌ సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను(Hyderabad CCS Police) కేసు నమోదు చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. టీహెచ్‌డీసీ, ప్రొగ్రెసివ్‌ సంస్థ మధ్య వర్క్‌కు సంబంధించిన రూ.1000 కోట్లకు పైగా నిధుల గురించి వివాదం తలెత్తడంతో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో కేసు నడుస్తోంది.


ఈ వివాదం అనంతరం రిత్విక్‌ ప్రాజెక్ట్సుతో ప్రోగ్రెసివ్‌ సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో రవికృష్ణ వేసిన పిటిషన్‌లో నాంపల్లి కోర్టు(Nampally Court) ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్‌ కంపెనీ ఎండీ పాతూరి ప్రవీణ్‌, ఈ సంస్థలోని సభ్యులు భాస్కర్‌ రావు, హేమలత, శ్రీవాణి, వేణుపై సీసీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు(Former Eluru MP Kavuri Sambasiva Rao) కుటుంబసభ్యులకు కూడా ఈకంపెనీతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ‘పెళ్లాం ఊరెళితే’, స్వయంవరం వంటి చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు.


వార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 06:52 AM