Jugaad vehicle: ఇతడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. స్క్రాప్‌తో మినీ కారు ఎలా తయారు చేశాడో చూడండి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 07:00 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Indian invention).
@mdtanveer87 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోడ్డు మీద వెరైటీ వాహనంపై ప్రయాణిస్తున్నాడు. చూడడానికి అది పాత వస్తువులతో తయారు చేసిన కారులా కనిపిస్తోంది. ఆ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. 'కొన్ని కలలు బ్రాండ్‌ల నుంచి కాదు.. కష్టపడి పనిచేయడం ద్వారా ప్రకాశిస్తాయి. ఇది కారు కాదు.. ఒక ఆలోచన. మీరు కోరుకుంటే, మీ స్వంత చేతులతో అసాధ్యమైన వాటిని సృష్టించవచ్చు' అని కామెంట్ చేశారు (creative jugaad).
ఈ వెరైటీ వాహనానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (homemade car). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. భారతదేశంలో ప్రతిభకు కొరత లేదని, సరైన మార్గదర్శకత్వం మాత్రమే అవసరమని ఒకరు కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరికీ మెదడు ఉంటుందని, దానిని ఎలా ఉపయోగిస్తారనే దానిపైనే అతడి పయనం ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..