Share News

Pankaj Tripathis Mother: ప్రముఖ నటుడి తల్లి కన్నుమూత..

ABN , Publish Date - Nov 02 , 2025 | 08:17 PM

నివారం హేమావతి అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. ఇక, ఈ విషాద సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని త్రిపాఠీ కుటుంబసభ్యులు మీడియాకు విన్నవించారు.

Pankaj Tripathis Mother: ప్రముఖ నటుడి తల్లి కన్నుమూత..
Pankaj Tripathis Mother

ప్రముఖ బహుభాషా నటుడు పంకజ్ త్రిపాఠీ తల్లి హేమావతి దేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 89 ఏళ్ల వయసులో శుక్రవారం తుది శ్వాస విడిచారు. బీహార్, గోపాల్ గంజ్ జిల్లా, బెల్‌సంద్ గ్రామంలోని ఇంట్లో ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హేమావతి చివరి క్షణాల్లో పంకజ్ ఆమె పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది.


శనివారం హేమావతి అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. ఇక, ఈ విషాద సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని త్రిపాఠీ కుటుంబసభ్యులు మీడియాకు విన్నవించారు. కాగా, పంకజ్‌ తండ్రితో కంటే తల్లితోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. క్రమ శిక్షణ, మానవత్వం, జాలి వంటివి తల్లి నుంచే తాను నేర్చుకున్నానని పంకజ్ తరచుగా చెబుతూ ఉన్నారు. తల్లి మరణంతో ఆయన బాగా కృంగిపోయారు.


తెలుగు సినిమాలో నటించిన పంకజ్..

పంకజ్ త్రిపాఠీ 2003లో విడుదలైన ‘చిగురిద కనసు’ అనే సినిమాలో నటించారు. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు. తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు. రన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2013లో దూసుకెళ్తా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం హిందీ భాషలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. 2025లో ‘మెట్రో ఇన్ దినో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు.


ఇవి కూడా చదవండి

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తింటే.. ఇన్ని సమస్యలు దూరమవుతాయా?

Updated Date - Nov 02 , 2025 | 08:17 PM