Share News

Youth Climbs 150 Foot Tower: టవర్ ఎక్కిన యువకుడు.. 16 గంటల పాటు పైనే..

ABN , Publish Date - Nov 02 , 2025 | 09:49 PM

అమ్మాయి ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శైలేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అశోక్ నగర్ జిల్లా, పండరి గ్రామంలోని 150 అడుగుల టవర్ ఎక్కాడు.

Youth Climbs 150 Foot Tower: టవర్ ఎక్కిన యువకుడు.. 16 గంటల పాటు పైనే..
Youth Climbs 150 Foot Tower

ప్రేమించిన యువతితో పెళ్లి కోసం ఓ యువకుడు ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు. 150 అడుగుల టవర్ ఎక్కి హై ఓల్టేజ్ లవ్ డ్రామాకు తెర తీశాడు. దాదాపు 16 గంటల పాటు టవర్‌పైనే గడిపాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శివ్‌పురి జిల్లాలోని బమోర్ కాలా గ్రామానికి చెందిన శైలేంద్ర.. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు.


ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే, అమ్మాయి ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శైలేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అశోక్ నగర్ జిల్లా, పండరి గ్రామంలోని 150 అడుగుల టవర్ ఎక్కాడు. ప్రియురాలితో పెళ్లి చేస్తానంటేనే కిందకు దిగుతానని పట్టుబట్టాడు. అలా శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పైనే ఉండిపోయాడు.


గ్రామస్తులు, పోలీసులు, ఆఖరికి కుటుంబసభ్యులు ఎంత చెప్పినా అతడు వినలేదు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తేనే కిందకు వస్తానన్నాడు. ప్రియురాలితో పెళ్లి చేయకపోతే కిందకు దూకుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ సంభాషణలు మొత్తం ఫోన్ ద్వారా జరిగాయి. ఒకానొక టైంలో అతడి ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పైకి ఎక్కి ఛార్జింగ్ ఉన్న ఫోన్ అతడికి ఇచ్చి వచ్చాడు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అధికారులు హామీ ఇవ్వటంతో అతడు కిందకు దిగాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..

బిగ్ అలర్ట్.. ఏపీలో రానున్న మూడు గంటల్లో వర్షాలు

Updated Date - Nov 02 , 2025 | 09:57 PM