Suryapet: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:27 AM
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ప్రేమించి, కులాంతర వివా హం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యు లే ఇలా చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు.

రాయితో తలపై మోది హతమార్చిన వైనం
తమ అమ్మాయిని ప్రేమించి, కులాంతర వివాహం
చేసుకున్నాడని యువతి కుటుంబీకుల కోపం
సూర్యాపేట రూరల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ప్రేమించి, కులాంతర వివా హం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యు లే ఇలా చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడకోండ్ల కృష్ణ అలియాస్ మాల బంటి(32) కుటుంబం కొన్నేళ్ల క్రితం సూర్యాపేటలోని బాషా నాయక్ తండాకు వలస వచ్చిం ది. సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్, బంటి ప్రాణ స్నేహితులు. నవీన్ ఇంటికి బంటి తర చూ వస్తుండేవాడు. ఈ క్రమంలో నవీన్ చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బంటి ఎస్సీ మాల, భార్గవి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రేమ విషయం తెలియడంతో బంటిపై నవీన్ కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్గవికి కౌన్సెలింగ్ చేసినా ఆమె వినలేదు. ఆరు నెలల క్రితం భార్గవిని బంటి పెళ్లి చేసుకుని సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో కాపురం పెట్టాడు. దీంతో బంటిపై నవీన్, అతడి కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బంటిని నవీన్, తన బంధువైన సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన మహేశ్‌తో ఫోన్ చేయించి పిలిపించాడు. తాను బయటకు వెళ్లివస్తానని భార్య భార్గవితో చెప్పిన బంటి.. తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చి వెళ్లాడు. రాత్రి 11 గంటలు దాటినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి మహేశ్‌కు ఫోన్ చేసింది. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో.. భర్త వస్తాడనుకుని ఆమె నిద్ర పోయింది.
మూసీ కాల్వ వద్ద మృతదేహమై..
పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వ వద్ద మృతదేహం ఉందని స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతుడిని బంటిగా గుర్తించారు. తలపై రాయితో మోదటంతో చనిపోయినట్లు నిర్ధారించారు. తన కుమారుడిని నవీన్ చంపాడని అనుమానం ఉందని బంటి తం డ్రి డేవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యు లే చంపారని భార్గవి విలపించింది. నవీన్, మహేశ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ రవి తెలిపారు. బంటి, నవీన్‌పై రెండు హత్యాయత్నం కేసులు, కొట్లాట కేసులున్నాయి. మహేశ్‌పై రెండు హత్యాయ త్నం, గొడవ కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉంది. ముగ్గురూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్