Share News

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:19 AM

సంక్రాంతి పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఏపీఎ్‌సఆర్టీసీ స్పష్టం చేసింది.

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఏపీఎ్‌సఆర్టీసీ స్పష్టం చేసింది. స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సు సర్వీసులు 94శాతానికి తగ్గకుండా ఆక్యుపెన్సీతో నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. కొన్ని రోజుల్లో 100శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని, అందుకే అంతర్‌రాష్ట్ర ప్రయాణీకులకు సంక్రాంతి సందర్భంగా రవాణా సేవలందించేందుకు పెద్ద పీట వేశామని వివరించింది. అందుబాటులో ఉన్న బస్సుల్ని పొరుగు రాష్ట్రాలకు నడుపుతున్నామని తెలిపింది.

Updated Date - Jan 08 , 2026 | 06:20 AM