Share News

సల్మాన్ ఇంట్లో డిన్నర్.. బీజేవైఎం నేత సాయి ప్రసాద్ పోస్ట్ వైరల్..

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:36 PM

భారతీయ జనతా యువమోర్చా కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ తన భార్యతో కలిసి సల్మాన్ ఖాన్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లారు. అనంతరం సల్మాన్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

సల్మాన్ ఇంట్లో డిన్నర్.. బీజేవైఎం నేత సాయి ప్రసాద్ పోస్ట్ వైరల్..
Film Star Salman Khan

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో భేటీకి సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా యువమోర్చా (BJYM) కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ తన భార్యతో కలిసి ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లారు. అనంతరం ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ సాయి ప్రసాద్ ఆ సాయంత్రాన్ని ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకంగా అభివర్ణించారు.


‘గొప్ప సంభాషణలు, హృదయపూర్వక ఆతిథ్యంతో గుర్తుండిపోయే సాయంత్రం. నా భార్యతో కలిసి మీ ఇంట్లో డిన్నర్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సల్మాన్ ఖాన్ భాయ్. మీ ఆప్యాయత, సింప్లిసిటీ నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి’ అని సాయి ప్రసాద్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ భార్య కూడా సల్మాన్ ఖాన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వాటినీ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సల్మాన్ అభిమానులు స్పందిస్తూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఫొటోలు సల్మాన్ ముంబైలోని ఇంటి వద్ద తీసినవిగా తెలుస్తోంది.


సల్మాన్ సినిమాల విషయానికొస్తే..

సల్మాన్ ఖాన్ చివరిసారిగా 2025లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సికందర్’ సినిమాలో నటించారు. ఈ ఏడాది ‘రాజా శివాజీ’, సౌదీ అరేబియా చిత్రం ‘7 డాగ్స్’లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీంతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ సల్మాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈద్ 2027 సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జ్ఞానేశ్ బ్రో అంతా అయిపోయింది.. రాజీనామా సమయం వచ్చింది: రాహుల్ గాంధీ

తీవ్ర విషాదం.. తల పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లి యువ క్రీడాకారిణి మృతి..

Updated Date - Oct 06 , 2026 | 04:42 PM