Share News

సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందిందంటే జిల్లాగా ఏర్పాటు కావడమే: హరీశ్ రావు

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:58 AM

జిల్లాగా ఏర్పాటు కావడం వల్లే సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేటలో జిల్లా దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.

సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందిందంటే జిల్లాగా ఏర్పాటు కావడమే: హరీశ్ రావు

సిద్దిపేట, అక్టోబర్ 09: జిల్లాగా ఏర్పాటు కావడం వల్లే సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందిందని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేటలో జిల్లా దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఓ కల.. ఎన్నికల నినాదమని గుర్తు చేశారు. పదేళ్ల క్రితం అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కొత్త జిల్లాగా ఏర్పాటైందని తెలిపారు. సిద్దిపేట, మంచిర్యాల, మెదక్ ఇలా మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.


1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్ దరఖాస్తు ఇచ్చారని తెలిపారు. ఏ చేతితో అయితే దరఖాస్తు ఇచ్చారో అదే చేతితో సిద్దిపేట కొత్త జిల్లా ఏర్పాటు చేశారని వివరించారు. సిద్దిపేట వాసులకు ఒకప్పుడు కొత్త జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, సిద్దిపేటకు రైలు మార్గం.. ఇలా మూడు కోరికలు ఉండేవని అన్నారు.


ఆ మూడింటిని తెచ్చుకున్నామని చెప్పారు. నిన్నటి సిద్దిపేట ఎలా ఉందో చూశారు.. నేడు సిద్దిపేట ఎలా ఉందో చూస్తున్నారు. రేపటి సిద్దిపేట ఎలా ఉండాలో చూడబోతున్నారని తెలిపారు. రేపటి సిద్దిపేట జిల్లాకు ఓ యునివర్సిటీ రావాల్సి ఉందని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దశాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

10, 11తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు: కేటీఆర్‌

Updated Date - Oct 09 , 2026 | 07:13 AM