చెప్పులమ్ముతున్న టీచర్‌

ABN , First Publish Date - 2020-09-01T09:12:47+05:30 IST

ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్లు. కరోనా వచ్చి మళ్లీ అవే పరిస్థితుల్లోకి టీచర్లను నెట్టేసింది. రోడ్డుపై చెప్పులు అమ్ముకొంటున్న ఓ ప్రైవేటు టీచర్‌ దుస్థితి కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను ..

చెప్పులమ్ముతున్న టీచర్‌

  • కొవిడ్‌లో వేతనాలు ఆగిపోయి, స్వయం ఉపాధిగా ఈ పనిలోకి
  • చలించిన కలెక్టర్‌.. ప్రైవేటు టీచర్‌ను ఆదుకుంటానని హామీ

గుణదల, ఆగస్టు 31: ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్లు. కరోనా వచ్చి మళ్లీ అవే పరిస్థితుల్లోకి టీచర్లను నెట్టేసింది. రోడ్డుపై చెప్పులు అమ్ముకొంటున్న ఓ ప్రైవేటు టీచర్‌ దుస్థితి కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను కదిలించింది. ఆ వివరాల్లోకి వెళితే.. విజయవాడ మాచవరంలో నివాసం ఉంటున్న తిర్లుక వెంకటేశ్వరరావు, సుమలకు 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. 15 సంవత్సరాలుగా వెంకటేశ్వరరావు ప్రైవేటు పాఠశాలల్లో పార్ట్‌టైమ్‌ మ్యాథ్స్‌ టీచరుగా పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు మూతపడటంతో కొన్నినెలలుగా జీతం రావడం లేదు. ఇల్లు గడవని పరిస్థితిలో స్నేహితుల సాయంతో విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని. వెంకటేశ్వరరావు చెప్పులు అమ్మడం ప్రారంభించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి వెళ్లింది.


ఆయన సోమవారం స్వయంగా వచ్చి వెంకటేశ్వరరావును పలకరించారు. స్వయం ఉపాధికి రుణసదుపాయం కల్పిస్తానని, లేదంటే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి, ఆయనలో ధైర్యం నింపారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌కు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, రోజుకు రూ. 250 నుంచి రూ. 300 వరకు చెప్పులు అమ్మి సంపాదిస్తున్నానని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-09-01T09:12:47+05:30 IST