నేడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు లేనట్టే

ABN , First Publish Date - 2020-09-01T17:22:59+05:30 IST

రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే నిల్వ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు నేడు పెన్షన్లు, జీతాలు లేనట్టుగా కనిపిస్తోంది.

నేడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు లేనట్టే

అమరావతి: రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే నిల్వ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు నేడు పెన్షన్లు, జీతాలు లేనట్టుగా కనిపిస్తోంది.  ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు ప్రతినెలా రూ.4,300 కోట్లు అవసరం ఉంటుంది. మంగళవారం కావడంతో రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీల వేలం ప్రక్రియ జరుగనుంది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద రూ.5 వేల కోట్లు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దీంతో సెక్యూరిటీల వేలం ద్వారా నగదు సమీకరించుకోవాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి లేదా రేపు జీతాల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-01T17:22:59+05:30 IST