ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగు పడే అవకాశం: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

ABN , First Publish Date - 2020-05-02T00:08:45+05:30 IST

ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగు పడే అవకాశం: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగు పడే అవకాశం: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

గుంటూరు: ప్రస్తుతం ఏపీలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరించారు. 

శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాల్లో పిడుగు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

శ్రీకాకుళం జిల్లా మందస, పలాస, మెలియపుట్టి, నందిగామ,వజ్రపుకొత్తూరు,టెక్కలి, పాతపట్నం ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉంది. 

గుంటూరు జిల్లా శావల్యాపురం, రొంపిచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, నూజెండ్ల, గురజాల, రెంటచింతల, కారంపూడి ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, అద్దంకి, మార్టూరు, యద్దనపూడి, దోర్నాల, అర్ధవీడు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, గిద్దలూరు ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లా  కౌతాలం, ఆదోని, హొలగుండ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరించారు.


Updated Date - 2020-05-02T00:08:45+05:30 IST